Dailyhunt
పవన్ కల్యాణ్ - విజయ్‌. పోలిక ఎందుకు?

పవన్ కల్యాణ్ - విజయ్‌. పోలిక ఎందుకు?

Telugu 360 1 week ago

విజయ్ విజయం.. తమిళనాటే కాదు. దేశ వ్యాప్తంగా కొత్త ప్రకంపనలను సృష్టించింది. ఓ సినిమా స్టార్ దక్కించుకొన్న అద్భుతమైన రాజకీయ విజయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఈ విజయం కొత్త పోలికలకూ తావిచ్చింది. ముఖ్యంగా తెలుగు నాట పవన్ కల్యాణ్ చేసిన రాజకీయాల్ని, విజయ్ పోలిటిక్స్ తో ముడి పెట్టి చూస్తున్నారు నెటిజన్లు.

విజయ్ - పవన్ సినీ, రాజకీయ జీవితాల్లో కొన్ని పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇద్దరూ యూత్ కథలతో ఫాలోయింగ్ సంపాదించుకొన్నవాళ్లే. పవన్ సినిమాల్ని తమిళంలో రీమేక్ చేసి, హిట్లు కొట్టాడు విజయ్‌. ఇద్దరి వైవాహిక జీవితంలోనూ ఒడిదుడుకులు ఉన్నాయి. ఇద్దరూ సినిమాల్లో తమ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే రాజకీయ ప్రయాణంలో విభిన్నమైన దారుల్ని ఎంచుకొన్నారు. పవన్ కల్యాణ్ పొత్తు రాజకీయాలు చేస్తే, విజయ్ `సోలో`గా బరిలోకి దిగాడు. పవన్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోతే.. విజయ్ తొలిసారే సీఎం కుర్చీలో కుర్చోబోతున్నాడు. ఈ విషయాలే పవన్ యాంటీ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. పవన్ కు సోలోగా పోటీ చేసే ధైర్యం లేదని, అందుకే పొత్తులు పెట్టుకొన్నాడని యాంటీ పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పవన్ కాస్త ధైర్యం చేసి, సోలోగా పోటీ చేస్తే ఇంకాస్త మెరుగైన ఫలితాలు వచ్చేవని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.

అయితే పవన్‌, విజయ్ ఇద్దర్నీ ఒకే గాటిన ముడిపెట్టడం కష్టం. తెలుగు నాట రాజకీయాలు వేరు, తమిళంలో వేరు. తెలుగులో రాజకీయాలకు, సినిమాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంది. తమిళంలో అలా కాదు. అక్కడ సినిమా, రాజకీయాలు మమేకం అయిపోయాయి. దాంతో పాటు తమిళంలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాల ఎజెండా ఒక్కటే. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం. అందుకోసం కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది. జగన్ హయాంలో ఏపీ పదేళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఈ దశలో.. ప్రభుత్వ వ్యవస్ధలు గాడిన పడాలంటే కచ్చితంగా సొంత ప్రయోజనాల్ని పక్కన పెట్టి, పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక బలమైన నాయకుడి చేతిలో ఏపీని పెట్టాల్సిన సందర్భం వచ్చింది. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయి. సో.. తెలుగు, తమిళ రాష్ట్రాలు, వాటి రాజకీయాలు వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. స

ఏది ఏమైనా ఓ సినిమా స్టార్‌, ఇప్పుడు పొలిటికల్ స్టార్‌గా మారాడు. ఈ మార్పు అభినందించదగినదే. ప్రజలకు సేవ చేయాలి, వాళ్ల కోసం నిలబడాలనుకొనే సినిమా తారలకు అప్పట్లో ఎన్టీఆర్ ఎలా మార్గ నిర్దేశనం చేశారో, ఎలా స్ఫూర్తిగా నిలిచారో, ఇప్పుడు విజయ్ కూడా అలానే కొండంత నమ్మకాన్ని కల్పించినవాడయ్యాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360