Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ సభకు నో పర్మిషన్ - వాట్ నెక్ట్స్ ?

పవన్ సభకు నో పర్మిషన్ - వాట్ నెక్ట్స్ ?

Telugu 360 4 months ago

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ కు అనూహ్యంగా బ్రేక్ పడింది.

గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్‌లో సభను నిర్వహించేందుకు జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. అయితే, శాంతిభద్రతల సమస్యలు, భద్రతా కారణాలతో సైబరాబాద్ పోలీసులు చివరి నిమిషంలో ఈ సభకు అనుమతి నిరాకరించారు.

పోలీసులు హఠాత్తుగా పర్మిషన్ రిజెక్ట్ చేయడంతో జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సభ నిర్వహణ కోసం పట్టుబడుతున్న జనసేన ముఖ్య నాయకులు.. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. శాంతియుతంగా, కేవలం పార్టీ అంతర్గత శ్రేణులతో నిర్వహించుకునే ఈ సభకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఒకవేళ న్యాయస్థానంలో అనుకూలమైన నిర్ణయం రాకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే అంశంపై జనసేన కోర్ కమిటీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పవన్ కల్యాణ్ పర్యటనను ఎలాగైనా విజయవంతం చేయాలని భావిస్తున్న నేతలు.. ఈ బహిరంగ సభను పూర్తిగా ఒక ఇండోర్ మీటింగ్ లేదా జనసేన ముఖ్య నేతలు, సాధక్ సమ్మేళనం ప్రతినిధులతో కూడిన పరిమిత సమావేశంగా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. పెద్ద ఎత్తున జనాలు రాకుండా కేవలం క్యాడర్ తో హాల్ మీటింగ్ నిర్వహించాలని యోచిస్తున్నారు.

తెలంగాణలో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ సాగుతున్న రాజకీయ వివాదాలతో ఈ సభ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సభ ద్వారా తెలంగాణలో పార్టీ బలోపేతంపై పవన్ కీలక దిశా నిర్దేశం చేయాల్సి ఉంది. అయితే పోలీసుల ఆంక్షల నడుమ ఈ సభ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? పవన్ కల్యాణ్ తన వ్యూహాన్ని ఎలా అమల్లోకి తెస్తారనేది కొద్ది గంటల్లో తేలనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360