Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ వెనుక బీజేపీ ఉందా !?

పవన్ వెనుక బీజేపీ ఉందా !?

Telugu 360 5 days ago

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో నవనిర్మాణ సంకల్ప సభ విషయంలో దుమారం ఆగడం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సభను అడ్డుకుంది.

అనుమతులు రాకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్లు, వాడుతున్న భాష శృతి మించిపోతోంది. అయితే పవన్ పై కాంగ్రెస్‌కు ఎందుకంత ఆందోళన అనేది చాలా మందికి అర్థం కాని విషయం. వారి ఆందోళనకు అసలు కారణం పవన్ వెనుక బీజేపీ ఉందనే అనుమానమే.

తెలంగాణలో పవన్ కల్యాణ్ రాజకీయ సభల నిర్వహణపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తూ, పవన్ కల్యాణ్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, "పైసలు ఇస్తే ఎలాంటి నటన అయినా చేస్తాడు.. ఏ డ్రెస్ అయినా వేసుకొని ఎగురుతాడు" అంటూ పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ సైతం తెలంగాణ ప్రశాంతతను దెబ్బతీయడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని, సనాతన ధర్మం పేరుతో బీజేపీ స్క్రిప్ట్ అమలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఇంతలా రెచ్చిపోవడం వెనుక పవన్ కల్యాణ్ రాక కంటే, ఆయన వెనుక ఉన్న శక్తుల గురించిన ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది.

చిత్రమైన విషయమేమిటంటే, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు పవన్ కల్యాణ్ అంశంపై పెద్దగా స్పందించడం లేదు. వా కానీ కాంగ్రెస్ మాత్రం తీవ్ర ఆందోళన చెందుతోంది. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఏపీలో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న పవన్, అదే ఉత్సాహంతో తెలంగాణలో అడుగుపెడితే.. అది రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీకి మైలేజ్ ఇస్తుందనేదే కాంగ్రెస్ ప్రధాన భయం. పవన్ క్రేజ్, గ్లామర్ వల్ల యువత, ముఖ్యంగా సెటిలర్ల ఓటు బ్యాంక్ కాంగ్రెస్ చేజారి కమలం వైపు మళ్లుతుందేమోనన్న కంగారు కాంగ్రెస్ వైఖరిలో స్పష్టంగా వ్యక్తమవుతోంది.

"పవన్ కల్యాణ్‌ను బీజేపీ వాడుకుంటోంది.. ఆయనను తెలంగాణలో రంగంలోకి దించింది కాషాయ పార్టీయే" అనేది కాంగ్రెస్ నేతల ప్రధాన ఆరోపణ. రాబోయే కాలంలో తెలంగాణే మా టార్గెట్ అని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ ద్వారా సనాతన ధర్మం, నవనిర్మాణం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పొలిటికల్ గ్రౌండ్ సిద్ధం చేయాలని బీజేపీ భావిస్తోందని అద్దంకి దయాకర్ వంటి నేతలు వాదిస్తున్నారు. పవన్ వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా ఉండి నడిపిస్తోందన్న అనుమానమే కాంగ్రెస్‌ను ఇంతలా డిఫెన్స్‌లోకి నెట్టేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360