అందరి దృష్టీ 18న విడుదల కాబోతున్న 'పెద్ది' ట్రైలర్ పైనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 'పెద్ది' నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్..
ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. రెండు పాటలు ఆల్రెడీ హిట్టయ్యాయి. ట్రైలర్ కూడా ఎక్కేస్తే… రిలీజ్ కు ముందు కావాల్సిన బూస్టప్ వచ్చేస్తుంది. ట్రైలర్ కూడా రెడగా ఉంది. ఇప్పటికే మెగాస్టార్ కి కూడా చూపించేశారు. ఆయన్నుంచి కూడా రివ్యూ వచ్చేసింది. ఈ ట్రైలర్ లోని డైలాగ్ ని కూడా చిరు లీక్ చేసేశారు. దాంతో ట్రైలర్ పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
3 నిమిషాల ట్రైలర్ లో ఏం చూపించబోతున్నారు? ఎన్ని సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయో అంటూ చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకొంటున్నారు.
ఈ ట్రైలర్‌లో హీరోయిజానికి ఎలివేషన్లు కావాల్సినన్ని పడ్డాయన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. చరణ్ పాత్ర ఏమిటి? ఎలా ఉండబోతోంది? ఆ పాత్రకున్న కాన్‌ఫ్లిక్ట్ ఏమిటన్న కీలకమైన విషయాలు ట్రైలర్ లోనే రివీల్ చేయబోతున్నారు. చరణ్ ఆటకూలీగా కనిపించబోతున్నాడన్న విషయం తెలిసిందే. అసలు ఆట కూలీ అంటే ఏమిటి? అతని జీవితం ఎలా ఉంటుందన్నది ట్రైలర్ లో రివీల్ చేస్తారు. ఊరి ఎమోషన్ కి పెద్ద పీట వేసినట్టు ముందు నుంచీ అర్థం అవుతూనే ఉంది. ఆ ఊరి కథ కూడా ట్రైలర్ లోనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన గ్లింప్స్ లో, పాటల్లో ఓ వెరైటీ షాట్ చూపించారు. ఇప్పుడు ట్రైలర్ లో మరో వెరైటీ షాట్ ఉండబోతోంది. అది కూడా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేదే. జాన్వీ కపూర్ పాత్రని కూడా పూర్తి స్థాయిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ పాత్ర చాలా హాట్ గా ఉండబోతోందని టాక్.
అంతేకాదు.. ఈ కథకు సంబంధించి, ముఖ్యంగా చరణ్ పాత్రకు సంబంధించి ఓ ముఖ్యమైన ట్విస్ట్ ఈ ట్రైలర్ లో చూపించబోతున్నారు. `పెద్ది` క్యారెక్టర్ లో ఉన్న గమ్మత్తు అది. అదేమిటన్నది ట్రైలర్ లో చూడాలి.

