Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పొరపాటుని ఒప్పుకున్న చరణ్

పొరపాటుని ఒప్పుకున్న చరణ్

Telugu 360 1 week ago

యాక్షన్ సీక్వెన్స్‌లు చేసేటప్పుడు గాయాలు జరుగుతుంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని పొరపాట్లు జరిగిపోతాయి. అయితే ఒక హీరోకి గాయం అయిందనే వార్త మాత్రమే బయటకు వస్తుంది గానీ, ఆ గాయం ఎలా జరిగింది?

దానికి అసలు కారణం ఏంటి? అనే విషయం పెద్దగా చర్చలోకి రాదు. కాకపోతే చాలాసార్లు గాయాలు హీరోల వైపు నుంచి జరిగిన చిన్న పొరపాట్ల వల్లే జరుగుతాయి. పెద్దిలో చరణ్ కి గాయం కూడా అలాంటి పొరపాటు వలనే జరిగింది.

చరణ్ కి గాయం ఎలా జరిగిందనే విషయంపై ఫైట్ మాస్టర్ నబాకాంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒక రోలింగ్ మూవ్‌మెంట్ చేస్తున్న సమయంలో ఈ గాయం జరిగిందని, అయితే ఆ బాధ్యత మొత్తం రామ్ చరణ్ తన మీదే తీసుకున్నారని చెప్పారు. "పొరపాటు తనదేనని ఆయన సెట్‌లోనే ఓపెన్‌గా ఒప్పుకున్నారు. తనకేమైందని అందరూ ఆయన వైపు పరుగెత్తుకొస్తుంటే… 'నాకంటే ముందు ఎదురుగా ఉన్న ఫైటర్‌కి ఎలా ఉందో చూడండి' అని గట్టిగా చెప్పారట. "తమవైపు పొరపాటు ఉందని హీరోలు ఒప్పుకోవడం చాలా అరుదు. కానీ చరణ్ గారు అలా బాధ్యత తీసుకోవడం ఆయన గొప్పతనం" అని నబాకాంత్ ప్రశంసించారు.

'పుష్ప' సినిమాతో ఫైట్ మాస్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నబాకాంత్, 'పెద్ది'లో కూడా కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేశారు. యాక్షన్, పెర్ఫార్మెన్స్ పరంగా 'పెద్ది' సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి చిత్రంగా నిలుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360