ఒకప్పుడు క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతుంటే విద్యార్థులు ముగ్ధులయ్యేవారు.. టీవీ స్టూడియోల్లో విశ్లేషణలు ఇస్తుంటే మేధావి అని జనం నీరాజనాలు పట్టేవారు..
ఆ క్రేజ్‌తోనే ఏకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఎమ్మెల్సీగా గెలిచి చరిత్ర సృష్టించారు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్. కానీ, కాలం మారింది.. ఆనాటి స్వతంత్ర విశ్లేషకుడి ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి, కేవలం వైసీపీ డిజిటల్ విభాగానికి కూలీగా మారిపోయారు. మేధావి స్థాయి నుంచి సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ అని పిలిపించుకునే స్థాయికి ఆయన రాజకీయ పతనం చెందడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
ఎంత డబ్బులిస్తే మాత్రం ఇలా మాట్లాడతారా?
గత ఎన్నికల సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కొన్ని విశ్లేషణలు చూస్తే, సామాన్య వైసీపీ కార్యకర్త కూడా అంత అడ్డగోలుగా సమర్థించలేడేమో అన్నట్లు సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను, ప్రజల భూముల పాస్ బుక్కులపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించడాన్ని ఆయన తన మేధో సంపత్తితో సమర్థించడానికి పడ్డ తపన చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. చట్టాలపై అవగాహన ఉన్న ప్రొఫెసర్, కేవలం తాడేపల్లి నుంచి వచ్చే లబ్ధి కోసమే ఇంతగా దిగజారిపోయారా అంటూ ఆనాడే ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు పోటీ చేస్తే డిపాజిట్ తెచ్చుకునేంత విశ్వసనీయత మిగుల్చుకున్నారా?
ఒకప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన అదే నాగేశ్వర్, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక చతికిలపడ్డారు. ప్రస్తుతం ఆయనకు మళ్లీ ఎన్నికల బరిలోకి దిగే ధైర్యం కూడా లేదు. తన విశ్వసనీయత అంతా పోగొట్టుకున్నారు. అందుకే యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా పెయిడ్ అనాలిసిస్ లు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య లేని చిచ్చు పెట్టడానికి.. జగన్ రెడ్డి.. బీజేపీకి పర్మినెంట్ ఫ్రెండ్ అని చెప్పడానికి ఏకంగా అమిత్ షా, పవన్ పేరును వాడేసుకుని మరింత దిగజారిపోయారు.
నాగేశ్వర్ పతనం ఓ పెద్ద పాఠం
నిజానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ పతనం సమాజానికి ఒక పెద్ద పాఠం నేర్పుతోంది. చదువు, పదవులు, సమాజంలో గౌరవం ఉన్నంత మాత్రాన సరిపోదని.. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నైతికత లేనప్పుడు ఎంతటి మేధావి అయినా కాలగర్భంలో కలిసిపోతాడని ఆయన నిరూపిస్తున్నారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన విశ్లేషకుడు, ఒక నిర్దిష్ట పార్టీ విదిల్చే ప్రయోజనాల కోసం తన సొంత క్రెడిబిలిటీని తాకట్టు పెట్టడం దారుణం. ఒకప్పుడు ఆయన మాటల కోసం ఎదురుచూసిన యువత, ఇప్పుడు ఆయన యూట్యూబ్ థంబ్ నైల్స్ చూసి చదువుంటే సరిపోదు సార్.. కాస్త నిబద్ధత కూడా ఉండాలి అంటూ మీమ్స్‌తో ట్రోల్ చేస్తుండటమే ఆయన ప్రస్తుత స్థితికి అద్దం పడుతోంది.

