ఓ సినిమాని జనంలోకి తీసుకెళ్లాలంటే. రకరకాల జిమ్మిక్కులు చేయాల్సిందే. స్పెషల్ ఎపీరియన్స్‌లూ, వాయిస్ ఓవర్‌లూ.. ఈ బాపతు ఎట్రాక్షన్‌లే. చిన్న సినిమాకి స్టార్ హీరో దిగి వచ్చి వాయిస్ ఓవర్ చెబితే - ఓ రకమైన క్రేజ్ ఏర్పడుతుంది. సదరు హీరో వల్ల, ఆ సినిమాకి పబ్లిసిటీ పెరుగుతుంది. ఆ వాయిస్ ఓవర్ తో సినిమా ఫలితాలేం మారిపోవు. జస్ట్ కాస్త ఎక్కువ ప్రచారం లభిస్తుందంతే.
ఇప్పుడు రాజమౌళి కూడా ఇదే టెక్నిక్ ఫాలో అవుతున్నాడు. `ఆర్.ఆర్.ఆర్` సినిమాకి గానూ.. హిందీ వెర్షన్‌కి అమీర్ ఖాన్ తో వాయిస్ ఓవర్ చెప్పించబోతున్నాడని టాలీవుడ్ టాక్. అమీర్ కీ, రాజమౌళికీ మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇద్దరూ కలసి ఓ సినిమా చేయాలనుకున్నారు.

