Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Telugu 360 2 days ago

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న ఎగువ సభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ధికారికంగా ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 10 రాష్ట్రాల పరిధిలోని మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.

జూన్ 1న ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుండగా, జూన్ 8 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

ఈ మెగా షెడ్యూల్‌లో ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ కోటాలో ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఈ విడతలో ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు స్థానాలూ కూటమి ఖాతాలోనే పడనున్నాయి. ఈ నాలుగు సీట్లను కూటమి భాగస్వామ్య పక్షాలు ఎలా పంచుకుంటాయనేది ఇప్పుడు అమరావతి రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల త్యాగాలు, రాజకీయ సమీకరణాలను బట్టి తమకూ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని జనసేన, బీజేపీ అధిష్టానాలు గట్టిగా కోరుతున్నాయి. జాతీయ స్థాయిలో పెద్దల సభలో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికి ఇదొక సువర్ణావకాశంగా మిత్రపక్షాలు భావిస్తుండటంతో, సీట్ల సర్దుబాటుపై కూటమి అగ్రనేతలు త్వరలోనే ఒక ఉమ్మడి నిర్ణయానికి రానున్నారు.

ప్రధాన భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీలో ) ఆశావహుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిపోవడం చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా కష్టపడిన సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు, సామాజిక సమీకరణాల రీత్యా ప్రాధాన్యత ఉన్న నేతలు ఈ దఫా ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మిత్రపక్షాలకు రెండు స్థానాలు కేటాయించాల్సి వస్తే, సొంత పార్టీలోని సీనియర్లను సముదాయించడం కత్తిమీద సాములా మారనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360