Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రావు బహదూర్' మిస్సయిన హీరో

'రావు బహదూర్' మిస్సయిన హీరో

Telugu 360 4 months ago

గతవారం విడుదలైన 'రావు బహదూర్‌' విమర్శకుల ప్రశంసలు అందుకొంటోంది. సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. వెంకటేష్ మహా దర్శకుడు. కమర్షియల్ సూత్రాలకు, పడికట్టు పద్ధతులకు దూరంగా తీసిన స్వచ్చమైన సినిమా ఇది.

ఓరకంగా ప్రయోగం అనుకోవొచ్చు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర మంచి రిజల్టే దక్కించుకొంది. ప్రమోషన్లు గట్టిగా చేయడం వల్ల నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి. ఎలా చూసినా ఇది సేఫ్ ప్రాజెక్టే. దానికి తోడు మంచి సినిమా తీశాం, చేశామన్న తృప్తి చిత్రబృందానికి మిగిలింది.

నిజానికి ఈ సినిమాలో ముందు అనుకొన్న హీరో సత్యదేవ్ కాదు. చాలా చోట్లకు ఈ సినిమా తిరిగింది. చాలామంది హీరోలకు వెంకటేష్ మహా ఈ కథ చెప్పాడు. రాజశేఖర్ తో అయితే ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. 'మర్మాణువు' పేరుతో సెట్స్ పైకి తీసుకెళ్దామనుకొన్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. అటు తిరిగి… ఇటు తిరిగి ఈ కథ సత్యదేవ్ దగ్గరకు వచ్చింది. విచిత్రం ఏమిటంటే… ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్లు `ఈ పాత్రకు సత్యదేవ్ తప్ప ఎవ్వరూ సరిపోరు` అని కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఈ సినిమాతో సత్యదేవ్ కి అవార్డులు, రివార్డులు రావడం ఖాయం అంటున్నారు. రాజశేఖర్ గనుక ఈ సినిమా చేస్తే, ఇలాంటి అప్లాజ్ అయితే కచ్చితంగా వచ్చేది కాదు. ఆ కథే వేరేలా ఉండేదేమో?

సత్యదేవ్ - వెంకటేష్ మహా కాంబోలో ఇది రెండో సినిమా. ఇది వరకు 'ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య' తీశారు. అది మంచి పేరే తీసుకొచ్చింది. ఇప్పుడు `రావు బహదూర్‌` రూపంలో హిట్ కాంబినేషన్ అనిపించుకొన్నారు. 'మా మధ్య ట్యూనింగ్ బాగా కుదిరిపోయింది. రెండేళ్లకు కనీసం ఒక్క సినిమా అయినా మా కాంబోలో తీసుకురావాలనుకొంటున్నాం' అంటున్నారు వీరిద్దరూ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360