Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవంత్‌ అంటే కేటీఆర్‌కు అంత అభిమానమా!?

రేవంత్‌ అంటే కేటీఆర్‌కు అంత అభిమానమా!?

Telugu 360 2 weeks ago

కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేరు.. అసలు కేసీఆర్ రాజీనామా చేస్తే ఏం జరుగుతుందో గతంలోనే చూశారు కదా అని కేటీఆర్ .. అసెంబ్లీకి రావాలంటున్న రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ అంతగా ఉక్కిరిబిక్కిరి అయితే.. బీఆర్ఎస్‌కు అంత కంటే కావాల్సిందేముంది..? రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాళ్లు విసురుతున్నప్పుడు, కేవలం మైకుల ముందు ప్రెస్ మీట్లతోనే సమాధానం ఇవ్వడం కాకుండా.. నిజంగానే సవాల్‌ను స్వీకరించి చేతల్లో ఎందుకు చూపించకూడదు?

కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతే మరింతగా ఎటాక్ చేయాలిగా!

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉపఎన్నికలను ఒక రాజకీయ ఆయుధంగా మలచుకుని కాంగ్రెస్, టీడీపీలను గడగడలాడించిన చరిత్ర కేసీఆర్‌కు ఉంది. ఉపఎన్నిక వస్తే క్షేత్రస్థాయిలో ప్రతిపక్షానికి ఉత్సాహం రావడం, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకతను నేరుగా ఓటు రూపంలో చూపించే అవకాశం లభించడం ఖాయం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని బీఆర్‌ఎస్ బలంగా నమ్ముతున్నప్పుడు.. కేసీఆర్ రాజీనామా చేసి గజ్వేల్ ఉపఎన్నికను ఆహ్వానించడానికి వెనుకాడాల్సిన అవసరం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.

రేవంత్‌ను వణికించకుండా ఎందుకు వదిలేస్తున్నారు?

కేటీఆర్ చేస్తున్న ఇటువంటి హెచ్చరికల్లాంటి డైలాగులు మీడియాలో హైలైట్ అవ్వడానికే పరిమితమవుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. కేవలం ప్రత్యర్థిని భయపెట్టే ప్రయత్నం చేయడం వల్ల పార్టీ క్యాడర్‌లో ఎలాంటి రాజకీయ ఊపు రాదు. పైగా, అధికార పక్షాన్ని కార్నర్ చేయడానికి చేతిలో ఇంత పెద్ద అవకాశం ఉన్నప్పుడు, సవాల్‌ను ముందుకు తీసుకెళ్లకుండా పదే పదే విమర్శలకే పరిమితం కావడం వల్ల కాంగ్రెస్ వైపు నుంచే పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల ఓటమి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడంతో బీఆర్‌ఎస్ క్యాడర్ ఇంకా కోలుకోలేదు. ఒకవేళ గజ్వేల్‌లో కేసీఆర్ రాజీనామా చేసి, అధికార బలంతో కాంగ్రెస్ ఉపఎన్నికలో విజయం సాధిస్తే.. అది బీఆర్‌ఎస్ మనుగడకే అతిపెద్ద దెబ్బగా మారుతుందనే హెచ్చరికలు ఉన్నాయి. అందుకే ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి కేటీఆర్ లేదా కేసీఆర్ తొందరపడటం లేదు. పైగా.. నీ మంచికే వదిలేస్తున్నామని కేటీఆర్ అంటున్నారు.

రాజకీయాల్లో ప్రత్యర్థిపై ఎవరూ జాలి చూపరు!

కేవలం హెచ్చరికలతో పొలిటికల్ మైలేజ్ రాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగానే ఇరకాటంలో పెట్టాలని, రేవంత్ రెడ్డి పీఠాన్ని కదిలించాలని బీఆర్‌ఎస్ భావిస్తే, మాటల యుద్ధాన్ని పక్కన పెట్టి చేతల్లోకి దిగక తప్పదు. అంతే కానీ తాము రంగంలోకి దిగితే రేవంత్ రెడ్డి తట్టుకోలేరని డైలాగులు చెబితే… తన ప్రత్యర్థిని తట్టుకోలేకుండా చేసే అవకాశం ఉన్నా వదిలేసే పార్టీ ప్రత్యర్థి పార్టీ అవదు. ఎప్పటికీ గెలవదు. కేటీఆర్ ఇలాంటి ప్రకటనలతో.. లేవడు కానీ లేస్తే మనిషి కాడు అన్నట్లుగా వ్యవహరిస్తే. ఎలివేషన్లు రావడం కష్టమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360