Dailyhunt
రిలీజ్‌కి ముందే సేఫ్‌. ఇది కదా క్రెడిబులిటీ

రిలీజ్‌కి ముందే సేఫ్‌. ఇది కదా క్రెడిబులిటీ

Telugu 360 3 weeks ago

సినిమా అనేది వ్యాపారం. ఆ తరవాతే మిగిలిన విషయాలు. పెట్టుబడి తిరిగి వస్తే, మరో సినిమా తీయడానికి ధైర్యం వస్తుంది. అందుకే 'టేబుల్ ప్రాఫిట్' దక్కించుకొన్న సినిమా అపురూపంగా కనిపిస్తాయి.

ఓ సినిమాకు టేబుల్ ప్రాఫిట్ రావడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా రిలీజ్‌కు ముందు. అది దర్శక నిర్మాతలు, హీరోల క్రెడిబులిటీని నిర్దేశిస్తుంది. అలాంటి నమ్మకాన్ని సంపాదించుకొన్నాడు అడవిశేష్‌. క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్‌.. ఈ సినిమా పేర్లు చెబితే చాలు. శేష్ కథల సెలక్షన్ ఎలాంటిదో చెప్పడానికి. స్వతహాగా తానో రచయిత కాబట్టి, తనకు అనుకూలమైన, తనకు కుదిరే కథల్ని రాసుకొని, వాటినే తెరపైకి తీసుకొచ్చి, ప్రేక్షకుల్ని మెప్పించగలుగుతున్నాడు. ఇప్పుడు తన నుంచి వస్తున్న సినిమానే 'డెకాయిట్‌'. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో మృణాల్ కథానాయికగా నటించింది. ఈనెల 10న వస్తోంది.

ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం అమ్మేశారు. థియేటర్ పరంగా కూడా మంచి బిజినెస్ జరిగింది. టోటల్ గా చూస్తే అన్నపూర్ణ స్టూడియోస్‌కి ఇది ప్రాఫిటబుల్ వెంచర్‌. అయితే సినిమా కొన్న బయ్యర్లు గట్టెక్కాలంటే మాత్రం మంచి టాక్ రావాల్సిందే. ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ బాగుంది. అనురాగ్ కశ్యప్ లాంటి నటులు ఈ ప్రాజెక్ట్‌లో ఉండడం ప్లస్ పాయింట్‌. ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? అనే విషయంపై కూడా టాలీవుడ్ దృష్టి సారించింది. వరుస హిట్లు కొట్టినా, శేష్ మిడ్ రేంజ్ హీరోనే. శేష్ లాంటి హీరోలకు ఇప్పుడున్న ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. శేష్ లాంటి హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఫస్ట్ డేనే థియేటర్లు ఫుల్స్ అయిపోవు. మెల్లగా టాక్ తెలుసుకొని, జనాలు థియేటర్లకు వస్తారు. అలాగైనా సరిపోతుందన్నది నిర్మాత నమ్మకం. కాకపోతే.. వరుసగా ఇన్ని హిట్లు కొట్టిన తరవాత కూడా ఓపెనింగ్స్ లేకపోతే ఓరకమైన ఇబ్బందే. కాకపోతే 'డెకాయిట్' 9 నుంచే ప్రీమియర్లు పడిపోతాయి. ప్రీమియర్ల దగ్గర టాక్ బాగుంటే ఓపెనింగ్ డేకి ప్లస్ అవుతుంది. సాధారణంగా శేష్ సినిమాలు మెల్లమెల్లగా పికప్ అందుకొంటాయి. కానీ `డెకాయిట్‌` కి మాత్రం తన కష్టం ఓపెనింగ్స్ లోనూ కనిపించాలని కోరుకొంటున్నాడు శేష్‌. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360