శ్రీలీలపై రూమర్లు కొత్తేమీ కావు. గతంలో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో ఆమె రిలేషన్‌లో ఉందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా క్రికెటర్ తిలక్ వర్మతో ఆమె డేటింగ్‌లో ఉందనే రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కొన్నాళ్ల క్రితం శ్రీలీల, తిలక్ వర్మ ఇద్దరూ తిరుమలను సందర్శించడం, ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో శ్రీలీల కనిపించడం వంటి విషయాలను కలిపి, వీరిద్దరి మధ్య రిలేషన్ నిజమే అన్నట్టుగా కొందరు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.
ఈ వార్తలు తారస్థాయికి చేరడంతో శ్రీలీల తల్లి స్వర్ణలత స్పందించారు. "సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. శ్రీలీల ప్రస్తుతం తన చదువు,నటనలో బిజీగా ఉంది. ఇలాంటి వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించడానికి ఆమెకు ఇంకా ఐదేళ్ళ సమయం ఉంది" అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇదే సమయంలో కార్తిక్ ఆర్యన్‌తో రిలేషన్‌పై వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించారు. "కార్తిక్ ఆర్యన్ మదర్, నేనూ ఇద్దరం వైద్యులం. మేము వృత్తిపరంగా కలుస్తుంటాం. కానీ అందరూ శ్రీలీల, కార్తిక్‌లకు రిలేషన్ ఉందని రాయడం మొదలుపెట్టారు. ఇలాంటి కథలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదు" అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశారు.
మొత్తానికి, శ్రీలీలపై ఇప్పటివరకు వచ్చిన అన్ని రూమర్లను స్వర్ణలత ఖండించారు. అలాగే వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించడానికి తనకు ఇంకా ఐదేళ్ల సమయం ఉందని కూడా స్పష్టం చేశారు. మరి ఇప్పటికైనా ఈ డేటింగ్ రూమర్లకు తెరపడుతుందేమో చూడాలి.

