Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SIRపై వైసీపీ టెన్షన్ !

SIRపై వైసీపీ టెన్షన్ !

Telugu 360 1 week ago

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ మొదలవ్వగానే ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో కంగారు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో ఓటర్ల నమోదు తొలగింపు ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని, లక్షలాది దొంగ ఓట్లను చేర్చారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

ఈ తరుణంలో ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర తనిఖీ ప్రక్రియలో ఈ అక్రమ ఓట్లు ఎక్కడ గాలిలో కలిసిపోతాయో అన్న భయంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి సహా వైసీపీ అగ్రనేతలు ముందస్తుగానే రక్షణ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

పాత పద్ధతులకు చెక్

ఐదేళ్లలో అధికార దుర్వినియోగం చేస్తూ రకరకాల ఫామ్ 7 ద్వారా ఇతర పార్టీల సానుభూతిపరుల ఓట్లను డిలీట్ చేయించారన్న విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలో ప్రభుత్వ అధికారులను తమ చెప్పుచేతల్లో ఉంచుకుని పకడ్బందీగా ఈ దందా సాగించినట్లు ప్రస్తుత విచారణలో వెల్లడయింది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో, ఆధునిక సాంకేతికతను వాడుతూ జరుపుతున్న ఈ ప్రక్షాళనలో ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించి ఓట్లు తొలగించిన అధికారులపై ఇప్పటికే ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో ఈ సర్ ప్రక్రియలో చాలా ఘనకార్యాలు వెలుగులోకి రానున్నాయి.

సజ్జల హడావుడి

ఓటర్ల ప్రక్షాళన ప్రక్రియను ఎదుర్కోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించడం, ఓట్ల తొలగింపుపై కోర్టులను ఆశ్రయించడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. అయితే, ఇది తమ క్యాడర్ ఓట్లను కాపాడుకోవడానికా, అక్రమంగా చేర్చిన ఓట్లు తొలగకుండా అడ్డుకోవడానికా అన్న సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిజమైన ఓటర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు హక్కు ఉంటుందని అధికారులు చెబుతున్నప్పటికీ, వైసీపీ మాత్రం తొలగింపు అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తోంది.

నిజమైన ఓటర్లదే విజయం

ఈ ప్రక్షాళన వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైన ఓటర్లకు మేలు జరుగుతుంది. బహుళ ఓట్లు , చనిపోయిన వారి ఓట్లు, బోగస్ అడ్రసులతో ఉన్న ఓట్లను ఏరివేయడం ద్వారా జాబితా పారదర్శకంగా మారుతుంది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు తమ మెడకే చుట్టుకుంటాయన్న ఆందోళనలోనే వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దొంగ ఓట్లను కాపాడుకోలేమని అర్థమవ్వడం వల్లే వైసీపీలో ఈ స్థాయిలో కంగారు పుడుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360