Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టాలిన్ మైండ్ గేమ్ - విజయ్ తట్టుకుంటారా?

స్టాలిన్ మైండ్ గేమ్ - విజయ్ తట్టుకుంటారా?

Telugu 360 6 days ago

మిళనాడులో తలపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వం కొలువుదీరి, కనీసం కుదురుకోక ముందే మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మైండ్ గేమ్‌కు తెరలేపారు.

విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదని, ఇది ఎంతో కాలం నిలబడదని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు కాబట్టి, డీఎంకే క్యాడర్ అంతా ఎల్లప్పుడూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఆయన జిల్లాల పర్యటనల్లో పిలుపునిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

విజయ్ సాధించిన ఈ ఎన్నికల విజయం వెనుక ఎలాంటి క్షేత్రస్థాయి కష్టం లేదని స్టాలిన్ విమర్శిస్తున్నారు. కనీసం బూత్ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని ఒక పార్టీ ఎలా గెలిచిందో అందరికీ తెలుసంటూ, ఈ గెలుపు క్రెడిట్ మొత్తాన్ని కేవలం ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా హైప్‌కే కట్టబెట్టారు. సామాజిక మాధ్యమాల్లో పిల్లలు, వృద్ధులను వాడుకుని తాత్కాలికంగా సృష్టించిన ఈ డిజిటల్ హైప్ త్వరలోనే పడిపోతుందని, పరిపాలనలోని లోపాలు బయటపడగానే జనం వాస్తవాలు గ్రహిస్తారని స్టాలిన్ తన క్యాడర్‌లో నూతనోత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

స్టాలిన్ పైకి ఎంతగా ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం ఆయన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేవలం రాజకీయంగా తనకు, తన పార్టీకి పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని గట్టి నమ్మకం కుదిరినప్పుడు మాత్రమే స్టాలిన్ తన వైపు నుంచి ఎలాంటి పాచికలైనా వేయగలరని భావిస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీలో ఏదైనా ఊహించని రాజకీయ సంక్షోభం తలెత్తి, విజయ్ ప్రభుత్వానికి ముప్పు వచ్చినా.. తక్షణమే ఎన్నికలకు వెళ్లడం కంటే, ప్రభుత్వాన్ని కాపాడేందుకే స్టాలిన్ మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తమిళనాడులో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేం కానీ, అవి కేవలం పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రమే సాధ్యపడవచ్చు. కేంద్రంలోని రాజకీయ సమీకరణాలు, జాతీయ స్థాయి ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి రాష్ట్రంలో ముందస్తు ముడిపడి ఉంటుందే తప్ప, స్టాలిన్ ప్రకటనల వల్ల తక్షణమే ప్రభుత్వం పడిపోదని విశ్లేషిస్తున్నారు.

Stalin Vs Vijay: విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు -త్వరలోనే తమిళనాడులో మళ్లీ ఎన్నికలు

tamilnadu political instability stalin on vijay government collapse early polls

Thalapathy Vijay: విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మళ్లీ ఎన్నికలు వస్తాయన్నారు.

Tamilnadu Early Polls : తమిళనాడులో మళ్లీ ఎన్నికలపై చర్చ ప్రారంభమయింది. సుమారు 59 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని శాసించిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని స్టాలిన్ జోస్యం చెబుతున్నారు. ప్రస్తుత విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని, డీఎంకే శ్రేణులు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పిలుపునివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360