కిచ్చా సుదీప్‌కు తెలుగులోనూ మంచి గుర్తింపే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. కాకపోతే ఆయన హీరో నటించిన డబ్బింగ్ సినిమాలు ఇక్కడ ఆశించిన స్థాయిలో రాణించిన దాఖలాలు పెద్దగా లేవు.
అయినప్పటికీ ఇప్పుడు తెలుగు నిర్మాతలు సుదీప్‌పై భారీ నమ్మకంతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్నారు.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న 'బిల్లా రంగ బాషాకు అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సుదీప్‌తో 'విక్రాంత్ రోణ' చిత్రాన్ని తెరకెక్కించిన అనూప్ మరోసారి ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'దేవరాయ' సినిమా చేస్తోంది. సుదీప్ శ్రీకృష్ణదేవరాయగా కనిపిస్తున్నారు. ఈ రెండు కూడా భారీ సినిమాలే. కన్నడలో సుదీప్ సినిమాలకి క్రేజ్ ఉంది.ఇప్పుడు ఆయన తెలుగు మార్కెట్ పై కూడా దృష్టి పెట్టారు. ఈ రెండు సిమిమాలకు నిర్మాతలు తెలుగు వారే విశేషం. 'బిల్లా రంగ బాషా, దేవరాయ సినిమాలు టాలీవుడ్‌లో సుదీప్‌కు ఎలాంటి బ్రేక్ ఇస్తాయి? పాన్ ఇండియా కలలు తీరుస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

