Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూటు , బూటు సీఎం విజయ్ !

సూటు , బూటు సీఎం విజయ్ !

Telugu 360 2 days ago

మిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ తన పరిపాలనా శైలి, డ్రెస్సింగ్ స్టైల్ కూడా భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. సాధారణంగా సినిమా రంగానికి చెందిన వారు, ముఖ్యంగా స్టార్ హీరోలు అంటే షూటింగ్ స్పాట్‌కు ఎప్పుడు వస్తే అప్పుడే టైమ్ అనుకుంటారనే ఒక టాక్ ఉంటుంది.

కానీ, రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన విజయ్ మాత్రం.. ఆ పాత అంచనాలను, ఇమేజ్‌ను పూర్తిగా బద్దలు కొడుతున్నారు. ఒక పక్కా ప్రొఫెషనల్ కార్పొరేట్ సీఈఓ తరహాలో ఆయన అనుసరిస్తున్న వర్కింగ్ స్టైల్ ఇప్పుడు చెన్నై సచివాలయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.

కరెక్ట్‌గా 9 గంటలకల్లా ఆఫీస్‌కు.. పరుగులు పెడుతున్న అధికారులు!

ముఖ్యమంత్రి విజయ్ ఉదయాన్నే కరెక్ట్‌గా ఆఫీస్ టైమింగ్స్ పాటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకల్లా తన లంచ్ బాక్స్ సర్దుకుని ఆయన నేరుగా సచివాలయానికి చేరుకుంటున్నారు. సాధారణంగా సీఎంలు మధ్యాహ్నం లేదా తమకు వీలైన సమయంలో వస్తారని భావించే ఐఏఎస్ అధికారులు, ఇతర సిబ్బందికి విజయ్ పంక్చువాలిటీకి షాక్ అవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా 9 గంటలకల్లా సీట్లో కూర్చుంటుండటంతో.. మిగతా ఉన్నతాధికారులు, మంత్రులు, సచివాలయ సిబ్బంది అంతా కూడా సమయపాలన పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక్క నిర్ణయంతోనే పరిపాలనా యంత్రాంగంలో ఆయన ఒక సరికొత్త క్రమశిక్షణను తీసుకొచ్చారు.

ఖద్దరుకు నో.. పవర్ సూట్ తో సరికొత్త ట్రెండ్!

రాజకీయ నాయకుడు అనగానే తెల్లటి ఖద్దరు చొక్కా, ధరించడం దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. అయితే, విజయ్ ఈ పాత పొలిటికల్ డ్రెస్ కోడ్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. తన ఎన్నికల ప్రచారంలో లూజ్ షర్టులు, ఖాకీ ప్యాంటులతో కనిపించిన ఆయన.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే రూటు మార్చారు. నిత్యం పక్కాగా ఫిట్ అయిన ఫార్మల్ వైట్ షర్ట్, డార్క్ సూట్ తో సచివాలయానికి వస్తున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ పవర్ డ్రెస్సింగ్ ద్వారా తాను కేవలం రాజకీయాలు చేయడానికి రాలేదని, రాష్ట్రాన్ని ప్రొఫెషనల్‌గా నడిపించేందుకు సిద్ధమయ్యాననే బలమైన సంకేతాలను పంపుతున్నారు.

ప్రత్యేక ముద్ర వేస్తున్న జననాయకన్

తన కేబినెట్‌ను 33 మంది సభ్యులతో భారీగా విస్తరించిన ముఖ్యమంత్రి విజయ్.. పరిపాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా గ్లామర్‌ను పక్కన పెట్టి, ఒక సాధారణ ఉద్యోగిలా బాక్స్ కట్టుకుని రావడం, ఆర్భాటాలు లేని డ్రెస్సింగ్‌తో పాలన సాగించడం తమిళ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ద్రవిడ రాజకీయాల మార్కు సాంప్రదాయ శైలికి భిన్నంగా విజయ్ తీసుకొచ్చిన ఈ మోడరన్ వర్కింగ్ కల్చర్ ఎన్ని రోజులు కొనసాగిస్తారో చూడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360