Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తప్పు చేయలేదు.. అయినా పోలీసులకు అప్పగించా: బండి సంజయ్

తప్పు చేయలేదు.. అయినా పోలీసులకు అప్పగించా: బండి సంజయ్

Telugu 360 1 week ago

నా కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో ఈరోజు అడ్వకేట్ల ద్వారా అతడిని పోలీసు విచారణకు అప్పగించాను

​చట్టం ముందు నా బిడ్డ అయినా సామాన్యుడైనా ఒకటే… అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే

​తను ఏ తప్పూ చేయలేదని నా కుమారుడు పదేపదే చెబుతున్నాడు

​ఫిర్యాదు రాగానే స్టేషన్‌కు పంపిద్దామనుకున్నాం కానీ లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను చూపించాం

​మా ఆధారాలు చూసి కేసు కొట్టేస్తారని… బెయిల్ ఖచ్చితంగా వస్తుందని లాయర్లు చెప్పడం వల్లే కొంత జాప్యం జరిగింది

​ఈరోజు కూడా బెయిల్ వస్తుందని లాయర్లు చెబుతున్నా ఇంకా ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతోనే పోలీసులకు అప్పగించాను

​సోమవారం నాడే కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దనే విచారణకు పంపించాను

​మాకు న్యాయవ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360