ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు, ఘర్షణలను గా గమనిస్తే.. ఇవి ఆకస్మికంగా తలెత్తిన రాజకీయ విభేదాలు కావని, ఐదేళ్ల నాటి క్రూరమైన అణిచివేతకు లభిస్తున్న ప్రత్యుత్తరమని స్పష్టమవుతోంది.
ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ వంటి ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు అల్లర్లు సృష్టిస్తున్న చోట్ల, గతంలో విపక్షాన్ని తీవ్రంగా వేధించిన ప్రాంతాల్లో తెలుగుదేశం శ్రేణులు అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అధికారంలోకి వచ్చినా ఇంకా సౌమ్యంగా, రామంలా చేతులు కట్టుకుని కూర్చుంటే అది మంచితనం అనిపించుకోదు.. పచ్చి చేతకానితనమే అవుతుందన్న భావన టీడీపీ కేడర్‌లో బలంగా నాటుకుపోయింది.
వైసీపీ హయాంలో నరకం అనుభవించారు!
గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో విపక్ష నేతలు, కార్యకర్తలు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులు, ఆస్తుల ధ్వంసం, వ్యాపారాల మూసివేతలతో పచ్చ చొక్కా కనిపించడమే నేరం అన్నట్లుగా అణచివేశారు. అధికారం లేనప్పుడు చావుదెబ్బలు తిని, కన్నీళ్లు దిగమింగిన కార్యకర్తలు.. నేడు ప్రజా తీర్పుతో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మళ్లీ అవే వైసీపీ శక్తుల చేతిలో దెబ్బలు తింటూ పలాయనం చిత్తగిస్తే, అది పార్టీ అస్తిత్వానికే ముప్పు తెస్తుంది. అందుకే, దెబ్బకు దెబ్బ.. వేధింపులకు ధీటైన సమాధానం అన్న రీతిలో టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో గట్టిగా నిలబడుతున్నాయి.
అవన్నీ గతంలో వైసీపీ అరాచకాలు చేసిన ప్రాంతాలే!
ప్రస్తుతం ఏయే ప్రాంతాల్లోనైతే తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగుతున్నాయో, ఆ స్థానాలన్నీ గతంలో వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో రాక్షసానందం పొందిన ప్రాంతాలే కా . 2021 స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థులను కనీసం నామినేషన్ కేంద్రాల వైపు కూడా రానివ్వకుండా దౌర్జన్యాలు చేసి, బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్న మాచర్ల, పిడుగురాళ్ల, పుంగనూరు వంటి గడ్డలపైనే ఇప్పుడు అసలైన రాజకీయ సెగ కనిపిస్తోంది. నాడు తాము చేసిన పాపాలు, సాగించిన ఆకృత్యాలే నేడు వైసీపీ నేతలను బూమరాంగ్ అయి వెంటాడుతున్నాయి. ఆనాడు నాటిన హింసా బీజాలే నేడు ప్రతిఘటన రూపంలో వారి కళ్లముందే నిలబడి ప్రశ్నిస్తున్నాయి.
జగన్ చేసిన తప్పు వల్లే
ఈ పరిణామాలన్నింటికీ ముమ్మాటికీ వైఎస్ జగన్ హయాంలో వ్యవస్థలను భ్రష్టుపట్టించి నడిపించిన ఫ్యాక్షనిజం, రౌడీయిజమే కారణం. అధికారం ఎల్లకాలం తమ వద్దే ఉంటుందన్న అహంకారంతో నాడు ప్రత్యర్థుల గొంతు నొక్కేసిన వైసీపీ నాయకత్వం.. నేడు అధికారం కోల్పోయాక కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తుంటే తిరుగుబాటు తప్పట్లేదు. ఇది కక్ష సాధింపు చర్య కాదని, కేవలం తమ ఆత్మరక్షణ, రాజకీయ మనుగడ కోసం టీడీపీ కార్యకర్తలు ప్రదర్శిస్తున్న సహజమైన ప్రతిఘటన . ఆనాడు చేసిన అరాచకాల పాపం పండిన వేళ.. తప్పు చేసిన నాయకులు నేడు ప్రజాక్షేత్రంలో ఆ సెగను అనుభవించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

