Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుచ్చి రేసులో త్రిష ఉందా!?

తిరుచ్చి రేసులో త్రిష ఉందా!?

Telugu 360 3 weeks ago

మిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుచ్చి శాసనసభ స్థానం చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి. రాఘవ లారెన్స్ పోటీ చేస్తారనే ప్రచారం గత కొద్దిరోజులుగా సాగింది.

అయితే, లారెన్స్ హఠాత్తుగా ఒక ప్రకటన చేస్తూ.. తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాను కానీ, ఇప్పుడు మాత్రం తిరుచ్చి నుండి పోటీ చేయడం లేదు అని స్పష్టం చేశారు. లారెన్స్ ఈ వెనకడుగు వేయడానికి స్వయంగా విజయ్ ఆయనకు టికెట్ ఖరారు చేయకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.

విజయ్ ఖాళీ చేసిన కోట

తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో తిరుచ్చికి ఒక ప్రత్యేకమైన చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. సెంట్రల్ తమిళనాడుకు గుండెకాయ వంటి ఈ నియోజకవర్గంలో విజయ్ ఘనవిజయం సాధించారు. కానీ రెండు చోట్ల గెలవడంతో తిరుచ్చిని ఖాళీ చేశారు. విజయ్ స్వయంగా వదిలేసిన స్థానం కావడంతో.. ఇక్కడ టీవీకే అభ్యర్థిగా ఎవరు నిలబడినా గెలుపు నల్లేరుపై నడకేననే భావన పొలిటికల్ వర్గాల్లో ఉంది. అందుకే ఈ హాట్ సీట్ కోసం పార్టీ లోపల, బయట ఉన్న సెలబ్రిటీల మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.

కోలీవుడ్ క్రేజీ కాంబినేషన్ రాజకీయాల్లోకి!

రాఘవ లారెన్స్ రేసు నుండి తప్పుకోవడంతో.. ఇప్పుడు తిరుచ్చి సీటు కోసం సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష పేరు ప్రముఖంగా తెరపైకి రావడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. విజయ్, త్రిషల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి, వారిద్దరి కాంబినేషన్‌కు కోలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఇటీవలి కాలంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి త్రిష సోషల్ మీడియా ద్వారా గట్టి మద్దతు ఇస్తూ వస్తున్నారు. తిరుచ్చి వంటి హై-ప్రొఫైల్ స్థానంలో ఒక గ్లామరస్, క్లీన్ ఇమేజ్ ఉన్న సెలబ్రిటీని నిలబెట్టడం ద్వారా మహిళా ఓటర్లను, ముఖ్యంగా యువతను పెద్ద ఎత్తున ఆకట్టుకోవచ్చని విజయ్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే త్రిషతో విజయ్ చర్చలు జరిపారని, ఆమె కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెన్నై పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.

విజయ్ మార్క్ మైండ్ గేమ్!

తిరుచ్చి స్థానాన్ని ఒక సామాన్య అభ్యర్థికి కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక స్టార్ సెలబ్రిటీకే ఇవ్వాలని విజయ్ పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే త్రిషను రాజకీయాల్లోకి తీసుకు వచ్చేందుకు విజయ్ సిద్ధంగా ఉండరని భావిస్తున్నారు. ఓ సామాన్యుడికే టిక్కెట్ ఇస్తారని అంటున్నారు. అదే సమయంలో ఇటీవల మహిళా నేత గౌతమి అన్నాడీఎంకేకు రాజీనామా చేశారు. ఆమె పేరు కూడా పరిశీలించే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360