Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'వారణాసి' లీకులు.. రాజమౌళికి ఇదేం తలనొప్పి?

'వారణాసి' లీకులు.. రాజమౌళికి ఇదేం తలనొప్పి?

Telugu 360 3 months ago

తెలుగు ప్రేక్షకులే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'వారణాసి'. రాజమౌళి సినిమా అంటేనే సెపరేట్ క్రేజ్‌.

దానికి తోడు మహేష్‌బాబు హీరో. ఇండియాలోనే అత్యంత ఖరీదైన సినిమా ఇది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతీ అప్ డేట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంటుంది. 2027లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. అయితే ఈలోపు… లీకుల బెడతదో 'వారణాసి' సతమతమవుతోంది. సినిమా అలా పట్టాలెక్కిందో లేదో… ఇలా… లీకులు మొదలైపోయాయి. అప్పట్లో మహేష్ కు సంబంధించిన ఓసీన్‌… బయటకు వచ్చేసింది. ఆ తరవాత చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకొంది. అయినా లీకులు ఆగడం లేదు. వారణాసి గ్లింప్స్ కు సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా అనఫిషీయల్ గా బయటకు వచ్చేశాయి. ఇప్పుడు.. రాముడి గెటప్ లో ఉన్న మహేష్ స్టిల్ బయటపడింది. ఇది చూసి ఫ్యాన్స్ కూడా షాకవుతున్నారు.

ఎందుకంటే… రాముడిగా మహేష్ ని చూపించడానికి ఓ ప్రత్యేకమైన సందర్భం కోసం చిత్రబృందం ఎదురుచూస్తోంది. అసలు ఈ గెటప్ ని రివీల్ చేయాలా, లేదంటే వెండి తెర అనుభూతి కోసం అట్టి పెట్టాలా అనే విషయంలో చిత్రబృందం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటప్పుడు ఈ స్టిల్ లీక్ అవ్వడం ఇబ్బంది కలిగించే అంశమే. ఇలాంటి లీకులు మున్ముందు ఇంకెన్ని జరుగుతాయో అనే బెంగ రాజమౌళి అండ్ టీమ్ లో ఉంది.

రాముడి స్టిల్ బయటకు వచ్చేయడంతో… ఈ గెటప్ ని అఫీషియల్ గా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతోందని టాక్. లీక్ ఫొటో అంటేనే క్వాలిటీ, క్లారిటీ రెండూ ఉండవు. అలాంటి స్టిల్స్ బయటకు రావడం వల్ల డామేజీ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకే.. నేరుగా రాముడి గెటప్ ని అఫీషియల్ గా రివీల్ చేయడం బెటర్‌. ఈ విషయమై చిత్రబృందం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది.

ఏదేమైనా ఈ లీకులు వారణాసి బృందంలో అలజడి రేపుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా, లీకులు ఆగకపోవడం ఇబ్బందికరమైన అంశమే. దీన్నుంచి ఎలా బయటపడతారో ఏమో?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360