Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వచ్చే ఎన్నికల్లో మంచు మనోజ్ భార్య పోటీ

వచ్చే ఎన్నికల్లో మంచు మనోజ్ భార్య పోటీ

Telugu 360 5 days ago

రాయలసీమ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన భూమా కుటుంబం నుంచి మరో వారసురాలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు స్వయంగా మనోజ్ అధికారికంగా ప్రకటించారు.

ఇటీవల తాము సంయుక్తంగా ప్రారంభించిన ఐక్య ధైర్య సేన సమితి సేవా సంస్థ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఈ స్వచ్ఛంద సంస్థ కేవలం పేదలకు సేవ చేయడానికేనని స్పష్టం చేస్తూనే.. తన భార్య మౌనిక మాత్రం ఖచ్చితంగా ఎన్నికల బరిలో నిలుస్తుందని చెప్పడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

భూమా మౌనికకు రాయలసీమలో, ముఖ్యంగా నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఘనమైన రాజకీయ బలం ఉంది. ఆమె తల్లిదండ్రులు దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు ఆ ప్రాంతంలో బలమైన ముద్ర వేశారు. ప్రస్తుతం మౌనిక సోదరి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కుటుంబంలో ఇప్పటికే ఒకరు చట్టసభల్లో ఉన్నప్పటికీ.. చిన్నప్పటి నుంచే రాజకీయ వాతావరణంలో పెరిగిన మౌనికకు కూడా రాజకీయంగా ఎదగాలనే బలమైన ఆకాంక్షలు ఉన్నట్లు తెలుస్తోంది.

మౌనిక కేవలం ఒక సెలబ్రిటీ భార్యగానే కాకుండా, క్షేత్రస్థాయిలో దూకుడున్న నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో అఖిలప్రియ కోసం గర్భిణీగా ఉన్నా ఆమె ప్రచారం చేశారు. ప్రసంగాల్లోనూ, ప్రజల్లోకి వెళ్లేటప్పుడు ఆమె చూపే చొరవ భూమా అనుచరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మె స్వతంత్రంగా తన రాజకీయ భవితవ్యాన్ని నిర్మించుకోవడానికి సిద్ధమయ్యారని, అందుకే సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, మౌనిక రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి, ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే విషయాన్ని మంచు మనోజ్ ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. తమకు సరైన ప్రాధాన్యత ఇచ్చి, గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉండే ఏ పార్టీలోనైనా చేరేందుకు ఈ దంపతులు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360