విశాఖపట్నం వైసీపీ నేతలు సాక్షి మీడియాను టీడీపీ కోవర్టుగా చూస్తున్నారు . తమ కార్యక్రమాలకు రావొద్దని నేరుగా చెబుతున్నారు. సాక్షి రిపోర్టర్లు అసలు తన నియోజకవర్గం వైపే రావొద్దని ఆయన బహిరంగంగా చెబుతున్నారు.
సాధారణంగా ఏ పార్టీ నేతలకైనా తమ సొంత మీడియా మీద కొండంత నమ్మకం ఉంటుంది. కానీ వాసుపల్లి గణేష్ కుమార్ కి మాత్రం సాక్షి పేరు వింటేనే చిర్రెత్తుకొస్తున్నట్లుంది.
వాసుపల్లి కేవలం అలకతో ఆగలేదు, ఏకంగా సాక్షి టీమ్‌కే షాకిచ్చే ఆరోపణలు చేశారు. మీరందరూ టీడీపీ కోసం పని చేస్తున్నారేమో అని నాకు డౌట్ వస్తోంది అంటూ ఆయన ఆవేదన చెందారు. వైసీపీ కోసం రక్తం చిందిస్తూంటే అసలు పట్టించుకోవడంలేదని తామే సొంతంగా ఒక పేపర్ పెట్టుకుంటామని, సోషల్ మీడియాలో డెవలప్ అవుతామని ఆయన ప్రకటిస్తున్నారు ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని నేరుగా భారతి మేడమ్ దృష్టికే తీసుకెళ్తానని వాసుపల్లి హెచ్చరించారు. నేను వదిలిపెట్టను.. పార్టీని, పేపర్‌ను మీరందరూ కలిసి మోసం చేస్తున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లో మారుమోగుతున్నాయి. విశాఖ అర్బన్‌లో వైకాపా గెలవకపోవడానికి సాక్షి తీరే ప్రధాన కారణం అవుతుందని వాసుపల్లి ముందే జోస్యం చెప్పారు.
వాసుపల్లి గణేష్‌కు కోపం ఎందుకు వచ్చిందో కానీ ఆయన ఏం చేస్తున్నా పత్రికలో రావడం లేదు. పబ్లిసిటీ లేదు. అందుకే ఆయన ఏ పనీ చేయడం లేదని అనుకుంటున్నారు. అయితే సాక్షి పేపర్లో ప్రతి నెతకూ ఓ రేటు కార్డు ఉంటుంది. వారి కార్యక్రమాలు కవర్ చేయాలంటే డబ్బులు కట్టాల్సిందే. అయితే అటు హైకమాండ్ కు.. ఇటు స్థానిక రిపోర్టర్‌కూ కట్టుకోలేక వాసుపల్లి లాంటి వాళ్లు ఇలా కంట్రోల్ తప్పిపోతున్నారు.

