Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీలో నెంబర్ 1 సర్దేసుకుంటున్నారా ?

వైసీపీలో నెంబర్ 1 సర్దేసుకుంటున్నారా ?

Telugu 360 4 hrs ago

తాడేపల్లి ప్యాలెస్‌లో అసలేం జరుగుతోంది? ఐదేళ్లపాటు సర్కారుకు, పార్టీకి సర్వం తానై నడిపించిన ఆ సర్వజ్ఞుడు ఇప్పుడు సైలెంట్ రిటైర్మెంట్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారా?.

గత కొద్ది రోజులుగా తాడేపల్లి ప్యాలెస్‌లో చక్కర్లు కొడుతున్న ఓ గాసిప్ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అంతర్గత వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఒకప్పుడు జగన్ నోటి నుంచి వచ్చే మాటకు ముందే ప్రెస్ మీట్లలో సమాధానాలు పేర్చిన ఆ అగ్రనేత.. ఇప్పుడు అధినేతతో విభేదించి తన సొంత దారి తాను చూసుకుంటున్నారనే గుసగుసలు వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఆయనే నెంబర్ వన్ అనే ప్రచారం

గత ఏడేళ్లుగా నాన్‌స్టాప్ బాటింగ్ చేసి, విపక్షాల విమర్శలన్నీ తన నెత్తినే వేసుకున్న ఆ కీలక సలహాదారునికి ఇప్పుడు సొంత పార్టీలోనే దిక్కుతోచని పరిస్థితి వచ్చిపడిందన్నది మొదటి పాయింట్. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ కేడర్ సైతం ఆయన్నే ప్రధాన ముద్దాయిగా చూస్తోంది. జగన్‌ను ప్రజలు మాత్రమే టార్గెట్ చేస్తే.. పార్టీలోని సొంత సోషల్ మీడియా సైన్యం కూడా సదరు నేత నిర్ణయాల వల్లే కొంప మునిగిందంటూ అంతర్గతంగా కారాలు మిరియాలు నూరుతోంది. ఇటు బాస్ వద్ద క్రెడిబిలిటీ పోయి, అటు కార్యకర్తల వద్ద పరువు పోయి.. ఇప్పుడు ఆయన పార్టీలో పూర్తి ఒంటరిగా మారారనే ప్రచారం జోరందుకుంది.

జగన్‌ ఉంచడని ఓ వైపు.. ఉండలేనని మరో వైపు !

తాజాగా మీడియా ముందుకు వచ్చిన సందర్భాల్లో అధినేత పక్కన కూర్చుని ఆయన పడ్డ పాట్లు చూసిన వారెవరికైనా వ్యవహారం తేడా కొడుతోందనే విషయం ఇట్టే అర్థమవుతోంది. లైవ్ కెమెరాల సాక్షిగా జగన్ అడ్డగోలు స్టేట్‌మెంట్లు ఇస్తుంటే.. దాన్ని సరిదిద్దలేక, ఆ తప్పిదాన్ని వెనకేసుకురాలేక సదరు మేధావి ముఖంలో కనిపించిన ఆందోళన అంతా ఇంతా కాదు. అధినేత మాటలకు, తన డిఫెన్స్‌కు ఇక ఏమాత్రం పొంతన కుదరడం లేదని ఆయన స్వయంగా ఒక నిర్ధారణకు వచ్చేశారని అంటున్నారు.

లెక్కలన్నీ సెటిల్ చేసుకుంటున్నారా?

ఇదే సమయంలో అత్యంత ఆసక్తికరమైన ఆర్థిక వ్యూహం తెరపైకి వచ్చింది. పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో.. తన వ్యాపారాలు, భారీ పెట్టుబడులను గుట్టుచప్పుడు కాకుండా విదేశీ షెల్ కంపెనీలకు మళ్లించేలా భారీ లావాదేవీల నెట్‌వర్క్ నడుస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రేపటి రోజున వైఎస్ కుటుంబ వారసత్వాన్ని, రాజకీయ పగ్గాలను ఆయనే లాగేసుకుని కొత్త రూపుతో తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఐదేళ్లు అధికారాన్ని చక్రం తిప్పిన ఈ కీలక నాయకుడు నిజంగానే జగన్‌కు హ్యాండ్ ఇచ్చి సైడ్ అయిపోతున్నారా.. లేక ఇది ప్రత్యర్థులు ఆడుతున్న పక్కా మైండ్ గేమా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఏది ఏమైనా, తాడేపల్లి కోటలో మాత్రం అగ్గి రాజుకుందన్నది బహిరంగ రహస్యం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360