Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌కు ఫస్ట్ ఫెయిల్యూర్ !

విజయ్‌కు ఫస్ట్ ఫెయిల్యూర్ !

Telugu 360 3 weeks ago

మిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన దళపతి విజయ్, ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. అన్నాడీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని ఆపరేషన్ అన్నాడీఎంకే ద్వారా సొంత మెజార్టీ సాధించాలన్న విజయ్ వ్యూహం ఇప్పుడు బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది.

విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు

అన్నాడీఎంకే నుంచి విడిపోయి విజయ్‌కు మద్దతు పలికిన 25 మంది ఎమ్మెల్యేల బృందంలో ఇప్పుడు చీలిక వచ్చింది. వారిలో సుమారు 20 మంది ఎమ్మెల్యేలు తాము విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు లేఖలు అందజేయడం సంచలనం సృష్టిస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయగా, మిగిలిన వారు ఎటు తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నారు. ఈ పరిణామం విజయ్ రాజకీయ చాణక్యానికి మొదటి వైఫల్యంగా మారింది.

మంత్రి పదవుల చిచ్చు - పళనిస్వామి వైపు చూపు

అన్నాడీఎంకే చీలిక వర్గ నేతలు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం నేతృత్వంలో విజయ్‌కు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు, తమకు మంత్రి పదవులు దక్కుతాయని ఆశించారు. కానీ విజయ్ పట్టించుకోలేదు. అయితే, విజయ్ తన సొంత మెజార్టీని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉండటం, మిత్రపక్షాలపై ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో వారికి ఆశించిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసంతృప్తి రాజుకుంది. ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు పోలోమని మళ్లీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోకి వెళ్లిపోయారు. అనర్హతా వేటు నుంచి తప్పించుకున్నారు.

ఐదు స్థానాలకు ఉపఎన్నికలు

నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉపఎన్నికలు విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ప్రస్తుతం ఆయనకు 10 మందికి పైగా ఎమ్మెల్యేల లోటు ఉంది. ఈ ఐదు స్థానాల్లో గెలిచినా మెజార్టీ సమస్య తీరదు సగదా.. ఒకవేళ ఒకటి, రెండు స్థానాల్లో ఓడిపోయినా అది విజయ్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తుంది. విజయ్ అనుసరిస్తున్న ఈ ఫిరాయింపుల రాజకీయం ఆయన మిత్రపక్షాలైన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కూడా కలవరపెడుతోంది. సొంత మెజార్టీ కోసం విజయ్ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కాకపోగా, మిత్రపక్షాల్లో అనుమాన బీజాలకు కారణమం అయింది. అందుకే విజయ్ ప్రభుత్వం ఐదేళ్ల కాలం పూర్తి చేసుకోదని జోస్యం చెబుతోంది. మిత్రపక్షాలను అలుసుగా చూడటం వల్లే విజయ్‌కు ఈ దుస్థితి వచ్చిందని డీఎంకే నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

సినిమాల్లో హీరోగా వెలుగొందిన విజయ్‌కు, రాజకీయ క్షేత్రంలో ఎదురైన ఈ తొలి పొలిటికల్ ఫెయిల్యూర్ ఒక గుణపాఠంగా మారింది. కేవలం రాజీనామాలు చేయించడం ద్వారా మెజార్టీ సాధించలేమని, రాజకీయాల్లో సమీకరణాలు గంట గంటకూ మారిపోతాయని ఈ పరిణామం నిరూపించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360