Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌కు మ్యూజిక్ స్టార్ట్ !

విజయ్‌కు మ్యూజిక్ స్టార్ట్ !

Telugu 360 1 week ago

హిళలకు డీఎంకే ప్రభుత్వం నెలకు రూ. వెయ్యి ఇస్తోంది. తాము వస్తే రెండున్నర వేలు ఇస్తామని విజయ్ మేనిఫెస్టోలో పెట్టారు. ఆ పథకం డబ్బులు మహిళల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్లు రావడంతో ప్రభుత్వం స్పందించింది.

ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేస్తున్నామని త్వరలోనే మహిళల ఖాతాల్లో రూ.వెయ్యి జమ చేస్తామని ప్రకటించారు. రెండున్నర వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి.. తీరా అధికారం చేపట్టాకవెయ్యి ఇవ్వడానికి గడువులు పెడుతున్నారని డీఎంకే అధినేత స్టాలిన్ అప్పుడేఎటాక్ ప్రారంభించారు. ఎలా సమర్థించుకోవాలో తెలియక టీవీకే నేతలు .. పేలవమైన ఎదురుదాడి చేస్తున్నారు.

ఎవరికీ పాలనానుభవం లేదు!

వెండితెరపై అసాధ్యాలను సుసాధ్యం చేసిన దళపతికి సెక్రటేరియట్‌లోని ఫైళ్ల కదలికలు, ఖజానా లెక్కలు అంతకంటే సంక్లిష్టంగా మారేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా పేరుకుపోయిన రూ. 10 లక్షల కోట్ల అప్పు, ఆదాయ లోటు ఇప్పుడు ఆయన పాలనకు మొదటి సవాల్‌గా నిలిచాయి. ప్రభుత్వ యంత్రాంగంపై గానీ, ఆర్థిక నిర్వహణపై గానీ తనతో సహా తన కేబినెట్ సహచరులకు ముందస్తు అనుభవం లేకపోవడం అతి పెద్ద సవాల్‌గా మారింది.

కొత్తవి కాదు.. డీఎంకే పథకాలను కొనసాగించడమే కష్టం

తాము ఇచ్చిన హామీల కన్నా ఇప్పుడు డీఎంకే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించడమే విజయ్ ముందున్న అతిపెద్ద టాస్క్. ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు నెలవారీ భరోసా వంటి పథకాలకు ఏటా వేల కోట్లు అవసరమవుతాయి. వీటికి తోడు విజయ్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే, గత బడ్జెట్ కంటే 52 శాతం అదనపు నిధులు సేకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉన్న తరుణంలో, ఈ అదనపు భారాన్ని మోయడానికి కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించాలి.

పాపం విజయ్‌ అని.. కేంద్రం సహకరించదు!

కాంగ్రెస్ , వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల, కేంద్రంలోని బీజేపీ సర్కార్ నుంచి రాష్ట్రానికి ప్రత్యేకమైన సాయం ఏదీ అందే అవకాశం లేదు. ప్రత్యేక నిధులు లేదా అదనపు గ్రాంట్ల విషయంలో సహాయం లభించడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ పూర్తిగా సివిల్ సర్వెంట్లు , అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. పరిపాలనలో జీరో అనుభవంతో ఉన్న విజయ్ బృందానికి అధికారులే దిక్సూచిగా మారనున్నారు. భావోద్వేగాలతో కాకుండా, కఠినమైన ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తేనే విజయ్ ముఖ్యమంత్రి గా తన ముద్ర వేయగలరని ఆర్థిక నిపుణులు సలహాలిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360