ఒకే కుటుంబం నుంచి ముగ్గురు స్టార్స్ సినిమాలు చేస్తున్నప్పుడు రిలీజ్ డేట్స్ విషయంలో క్లారిటీ అవసరం. ఎవరి సినిమా ఎప్పుడు వస్తుంది? ఏ సినిమాకు సోలో డేట్ దొరుకుతుంది?
ఒక సినిమా మరో సినిమాతో క్లాష్ కాకుండా ఎలా ప్లాన్ చేయాలి? ఇలాంటి విషయాల్లో ముందుగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. విజయ్ దేవరకొండ కుటుంబం ఇప్పుడు ఈ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ చూపిస్తోంది.
ఆనంద్ దేవరకొండ ఎపిక్ సెప్టెంబర్ లో వస్తోంది. ఈ సినిమా తర్వాత సుమారు నెల గ్యాప్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీగా నటించిన రణబలి అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రష్మిక లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'మైసా' నవంబర్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు. అంటే ఒక సినిమా తర్వాత మరో సినిమాకు తగిన గ్యాప్ ఉండేలా డేట్స్‌ను చూసుకున్నారు. నవంబర్ 27 ప్రస్తుతం పెద్దగా పోటీ కనిపించని డేట్ కావడంతో 'మైసా'కు మంచి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి ఒకే కుటుంబానికి చెందిన స్టార్స్ సినిమాలు వరుసగా వచ్చినా, వాటి మధ్య పోటీ లేకుండా చూసుకోవడం ముఖ్యం. విజయ్ ఫ్యామిలీ రిలీజ్ డేట్స్ చూస్తుంటే ఆ విషయంలో మంచి అవగాహనతోనే ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. రిలీజ్ డేట్స్ విషయంలో ఇలాంటి ప్లానింగ్ చాలా అవసరం.

