Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'చిన్న సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోంది' : నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ

Telugu Adda 3 days ago

Ads

▪️ నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సంచలన ఆరోపణలు
▪️ థియేటర్ల కేటాయింపు నుంచి ఓటీటీ వరకు అన్నిచోట్ల అడ్డంకులే
▪️ ఫిల్మ్ చాంబర్ స్పందించడం లేదు

▪️ పీవీఆర్, ఐనాక్స్‌కు నోటీసులు పంపించాను
▪️ చిన్న సినిమాలను బతికించమని వేడుకుంటున్నా

హైదరాబాద్:
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై ఇండస్ట్రీలో పెద్ద కుట్ర జరుగుతోందని దర్శకుడు, నటుడు షెరాజ్ మెహదీ ఆరోపించారు. తన చిత్రం 'ఓ అందాల రాక్షసి' విడుదల, రీ-రిలీజ్ సమయంలో ఎదురైన ఇబ్బందులపై ఫిల్మ్ చాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమా మీద మాత్రమే కాదు లో-బడ్జెట్ సినిమాల నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకుంటున్నారని షెరాజ్ ఆరోపించారు. థియేటర్ల కేటాయింపు వ్యవస్థలో రాజకీయాలు పనిచేస్తున్నాయని, దీనివల్ల చిన్న చిత్రాలు నష్టపోతున్నాయని తెలిపారు.

హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో చిన్న చిత్రాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే షోలు ఇస్తున్నారని, అవి కూడా ప్రేక్షకులు తక్కువగా వచ్చే సమయాల్లో కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల సినిమాలు ప్రేక్షకుల దృష్టికి చేరకముందే విఫలమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. థియేటర్లతో పాటు ఆడియో రైట్స్, శాటిలైట్ హక్కులు, ఓటీటీ ప్లాట్‌ఫార్ములు, ఓవర్సీస్ మార్కెట్ వంటి అన్ని విభాగాల్లోనూ చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కొత్త దర్శకులు, నిర్మాతలకు అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఓ అందాల రాక్షసి' సినిమా చాలా బాగా వచ్చిందని ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. అంత హిట్ సినిమాను కూడా ఇండస్ట్రీ పెద్దలు రానివ్వడం లేదు. ఈ సమస్యపై ఫిల్మ్ చాంబర్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదన్నారు. భరత్ భూషణ్ గారు తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. థియేటర్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. మొదటి విడుదల సమయంలో సరైన అవకాశాలు లభించి ఉంటే రీ-రిలీజ్ అవసరం వచ్చేది కాదని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల్లో సినిమాలకు సబ్సిడీలు అందుతున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న చిత్రాలకు ప్రత్యేక ప్రోత్సాహక విధానాలు తీసుకురావాలని షెరాజ్ కోరారు. ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నప్పటికీ చాలామంది భయంతో బహిరంగంగా మాట్లాడడం లేదని, తాను మాత్రం నిజం కోసం పోరాడుతున్నానని షెరాజ్ తెలిపారు. పరిస్థితులు మారకపోతే తెలుగు చిత్ర పరిశ్రమను విడిచి ఇతర భాషా పరిశ్రమల్లో పనిచేయాలనే ఆలోచన కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

End of Article

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Adda