Dailyhunt

మే 8న విడుదలకు సిద్ధమైన 'ఎం4ఎం'

Telugu Adda 3 weeks ago

Ads

▪️ ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్
▪️ దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణం
▪️ పాన్ ఇండియా థ్రిల్లర్‌గా 'ఎం4ఎం (Motive for Murder)

ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎం4ఎం (M4M - Motive for Murder)' చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "M4M (Motive for Murder)" పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, McWin Group USA సహకారంతో రూపొందించారు.

భారతదేశంలో ఈ చిత్రాన్ని PVR Inox Pictures సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది. అమెరికాలో విడుదల బాధ్యతలను TekFlix Entertainment, ఉత్తర భారత విడుదలను JVEL Entertainment సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో "M4M" చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

థియేటర్లలో విడుదలకు ముందే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ప్రముఖ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా Palais C Theatre లో ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించగా, ముంబైలోని IMPPA Preview Theatre లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలకు సినీ వర్గాల నుంచి మంచి స్పందన లభించింది.

ఇక హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్‌లో విస్తృతంగా నిర్వహించిన ప్రమోషన్ టూర్ చిత్రానికి మరింత ప్రచారం తీసుకువచ్చింది .

ఈ సందర్భంగా దర్శకుడు-నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, మే 8న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే మా సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడటం గర్వకారణమని తెలిపారు. సినిమా ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించిందని, థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉత్కంఠభరిత అనుభూతికి గురిచేసే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా "M4M" ప్రత్యేక గుర్తింపు పొందుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

బ్యానర్‌: మోహన్ మీడియా క్రియేషన్స్
సహకారం: McWin Group USA
నటీనటులు: జో శర్మ, సంబీత్ ఆచార్య, తదితరులు.
దర్శకత్వం, నిర్మాణం: మోహన్ వడ్లపట్ల
పీఆర్ఓ: పర్వతనేని రాంబాబు, కడలి రాంబాబు, అశోక్ దయ్యాల

End of Article

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Adda