మొదటిరోజు నుండి హర్ట్ అవుతూనే ఉన్నా అంటూ "అభి" ఎమోషనల్.!

మొదటిరోజు నుండి హర్ట్ అవుతూనే ఉన్నా అంటూ "అభి" ఎమోషనల్.!

Telugu Adda

Telugu Adda

1954d

Loading...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫినాలే కి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది. ఈ జర్నీలో మనం అనుకోని కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అయ్యారు. షో మొదట్లో గొడవలతో నడిచినా కానీ ఇప్పుడు కంటస్టెంట్స్ అందరూ బాగా కలిసిపోయారు. ఈ వారం సేఫ్ అవడానికి అవినాష్ తన కార్డుని ఉపయోగించుకున్నారు. శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ కింగ్ నాగార్జున కంటెస్టెంట్స్ చేసిన తప్పుల గురించి మాట్లాడారు. ఆదివారం ఎపిసోడ్ లో కన్నడ స్టార్ హీరో, అలాగే కన్నడ బిగ్ బాస్ హోస్ట్ సుదీప్ మన తెలుగు బిగ్ బాస్ కి గెస్ట్ గా వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అఖిల్, హారిక,అరియానా, సోహెల్, అభిజిత్, మోనాల్, అవినాష్ ఉన్నారు. ఈ వారం ఇంటికి కెప్టెన్ ఎవరూ లేరు.

దాదాపు గత వారం మొత్తం దెయ్యం టాస్క్ జరిగింది. ఆదివారం ఎపిసోడ్ లో కూడా ఒక్కొక్కరిని చీకటి రూం లోకి పంపించారు. అంతకు ముందు చీకటి రూం లోకి వెళ్ళిన అఖిల్ ఇంకా సొహెల్ భయపడిన వీడియోని కూడా ఆదివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరికీ చూపించారు. ఇది ఇలా ఉండగా తాజాగా ప్రోమో వచ్చింది. అది ఒక లుక్ వేయండి.

watch video:

తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Adda