తెలుగు సినిమా ఆడియన్స్ కి సురేఖ వాణి బాగా పరిచయమే. సైడ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి గా, అక్క గా, అత్తగా నటించి మెప్పించారు. బ్రహ్మానందం తో కలిసి నటించి కామెడీ పండించి అందరిని అలరించారు. కొద్దికాలం క్రితమే ఆమె భర్త సురేష్ తేజ మరణించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో సురేఖ వాణి ఎంత ఆక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. కూతురుతో కలిసి డాన్స్ లు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా పోస్ట్ చేసిన ఓ వీడియో చర్చనీయాంశం అయ్యింది.
పొట్టి డ్రెస్ లు వేసుకొని ఆమె పెట్టిన పోస్ట్ లకు నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. సినిమాలో అంత సంప్రదాయంగా ఉంటారు.సోషల్ మీడియాలో ఏంటి ఇది?



