Wednesday, 05 Aug, 10.30 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
15 ఏళ్లలో ఎన్నడూ చూడని విపత్కర పరిస్థితులను చూస్తున్న ముంబై మహానగరం..!

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రవేశించిన రోజు నుండి ముంబై మహానగరంలో పరిస్థితులు ఘోరంగా మారిపోయాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముంబైలో విదేశీయుల రాక పోకలు విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా ఉదృతి అన్ని ప్రాంతాల్లో విస్తరించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ముంబైలోని ధారవి మురికివాడల్లో నివసించే పేద ప్రజల ప్రాణాలతో కరోనా వైరస్ చెలగాటమాడుతోంది. ఇప్పటికే ఒక్క ముంబై నగరంలోనే 6, 500 మంది కరోనా తో మరణించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి అంటే కరోనా తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే నాలుగున్నర లక్షల పాజిటివ్ కేసులలో దాదాపు ఒకటిన్నర లక్షల పాజిటివ్ కేసులు ఒక్క ముంబై నగరంలోని నమోదయ్యాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ముంబై నగరానికి మరొక విపత్తు వచ్చిపడింది. మహా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ముంబై నగరంలో గత కొన్ని రోజులుగా బీభత్సంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా ముంబై నగరం మొత్తం వరదలతో నిండిపోయింది. 2005వ సంవత్సరంలో ముంబై నగరం భారీ వర్షపాతం కారణంగా జలమయమై నానా అవస్థలు పడింది. మళ్లీ ఇప్పుడు అనగా 15 సంవత్సరాల తర్వాత ముంబై నగరం భారీ వర్షపాతం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆగస్టు 3వ తేదీన కురిసిన భారీ వర్షం కారణంగా 198 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయింది. గత పదిహేను సంవత్సరాల్లో 198 మిల్లీ మీటర్ల వర్షపాతం ఎన్నడూ నమోదు కాలేదని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఒకవైపు వరదలు మరోవైపు కరోనా... ఈ రెండు విపత్తులతో ముంబై మహానగరం తల్లడిల్లిపోతుంది.


మహారాష్ట్రలో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు బుధవారం భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు మహారాష్ట్రలోని ముంబై తో సహా దాని పొరుగు ప్రాంతాలను కూడా ప్రభావితం చేస్తుంది. నగరంలో బుధవారం "అత్యంత భారీ" వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ 'రెడ్' హెచ్చరిక జారీ చేయబడింది. దీంతో లోకల్ ట్రైన్స్ అన్ని స్తంభించిపోయాయి. వరదల కారణంగా ఇప్పటికే ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. ముంబై లోని ఒక ప్రాంతం లో 35 ఏళ్ల మహిళ తో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కూడా వరదలలో కొట్టుకుపోయారు. మహారాష్ట్రలోని థానే నగరంలో వరదల కారణంగా ఒక విద్యుత్ స్తంభం నుండి జ్యోతి ఒక వ్యక్తికి ప్రవహించడంతో అక్కడికక్కడే మరణించాడు. 15 ఏళ్ల బాలుడు కూడా కరెంట్ షాక్ తో మరణించాడు. ఇంకా మూడు నాలుగు రోజుల పాటు ముంబై నగరంలో భారీ వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముంబై నగర వాసులు ఆందోళన పడుతున్నారు.

ప్రభాస్, ఆ సినిమా చేయకుండా ఉంటే బాగుండేదంటున్నారు .....??

శతాబ్ధాల చరిత్రలో ఇది ఓ అపూర్వ ఘట్టం !

తిరుపతిలో దారుణం... కరోనా శవాలను వదలని దుర్మార్గులు...?

ఛ .... అసలు ఆ స్కిట్ లో నటించకుండా ఉండాల్సింది .... ఆవేదన చెందుతున్న రష్మీ .....??

కరెన్సీ నోట్లపై శ్రీరాముడు..!

భారతదేశ చరిత్రలో ఈ రోజుని సువర్ణాధ్యాయం గా వర్ణించిన ప్రధాని మోడీ..!

చైనా మోసం, వంచన వల్లే లక్షల్లో కరోనా మరణాలు.... ట్రంప్ సంచలన వ్యాఖ్యలు...?

ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top