Dailyhunt
'ఆచార్య' లో పూజా హెగ్డే.. క్లారిటీ వచ్చేసింది..?

'ఆచార్య' లో పూజా హెగ్డే.. క్లారిటీ వచ్చేసింది..?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై తెలుగు చిత్రపరిశ్రమలో భారీగానే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడు కొరటాల శివ ఇక మెగాస్టార్ తో సినిమా తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం ఖాయమని ప్రస్తుతం అభిమానులు భావిస్తున్నారు. అదే సమయంలో ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తూ ఉండడం అందరిలో మరింత అంచనాలు పెంచేసింది.

ఇకపోతే ఇప్పటికే మెగాస్టార్ సరసన మరోసారి కాజల్ అగర్వాల్ ని సెలెక్ట్ చేసింది చిత్ర బృందం అన్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా లో ఆలయాలను కాపాడే అధికారి పాత్రలో నటించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా నటించబోయే హీరోయిన్ ఎవరు అన్నదానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. గతంలో రష్మిక మందన్న ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించేందుకు అవకాశం దక్కించుకుంది అని ఎన్నో రకాల వార్తలు హల్ చల్ చేశాయి అన్న విషయం తెలిసిందే.

ఇకపోతే రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అన్నదానిపై క్లారిటీ వచ్చింది.
ఆచార్య సినిమాలో చరణ్ సరసన నటించేది రష్మిక మందన్న కాదని పూజా హెగ్డే అనే క్లారిటీ వచ్చింది. ఇటీవలే పూజా హెగ్డే ఆచార్య షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధం అయింది అని సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చరణ్ ల మధ్య ఉండే కీలక సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత పూజా హెగ్డే రామ్ చరణ్ మధ్య ఉన్న సన్నివేశాలను తెరకెక్కిస్తారట కొరటాల శివ. అయితే ఇక ఈఎలా ఉండబోతుందో అని అటు అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాగుబోతు ముఖ్యమంత్రి... రేవంత్ కీలక వ్యాఖ్యలు


కరోనాతో గుండెజబ్బులు... కొత్త విషయం వెలుగులోకి..

పుర పోరు: పశ్చిమలో ఆ ఒక్క మహిళతో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పురపోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జన్యాలు.. ఏకగ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald