Dailyhunt
అక్కినేని ఫ్యాన్స్ కు శుభవార్త.... తల్లి కాబోతున్న సమంత...?

అక్కినేని ఫ్యాన్స్ కు శుభవార్త.... తల్లి కాబోతున్న సమంత...?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లైన తరువాత కూడా వరుస విజయాలతో సమంత దూసుకెళ్తున్నారు. పెళ్లికి ముందు గ్లామర్ పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చిన సమంత పెళ్లి తరువాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తున్నారు. గత నెలలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కి విడుదలైన 96 రీమేక్ జాను కమర్షియల్ గా హిట్ కాకపోయినా సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే మరోసారి సమంత గర్భవతి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సమంత గర్భవతి అని వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో సోషల్ మీడియాలో సమంత గర్భవతి అయిందని వార్తలు వచ్చాయి. ఓ బేబీ సినిమా విడుదల సమయంలో సమంత గర్భవతి అంటూ వార్తలు వైరల్ కావడంతో "అయ్యో...

అవునా... ఆమె గర్భవతా...? మీకు తెలిసినప్పుడు మాకు కూడా చెప్పండి" అని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తరువాత సమంత గర్భవతి అని ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.

సమంత గర్భవతి అని ప్రచారం జరగటానికి ఒక కారణం ఉంది. కొన్ని రోజుల క్రితం సామ్ తమిళంలో ఒక భారీ ప్రాజెక్టులో నటించడానికి ఓకె చెప్పింది. విజయ్ సేతుపతి, నయనతార హీరోహీరోయిన్లుగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సమంత ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే మొదట సినిమాలో నటించడానికి అంగీకరించిన సమంత తాజాగా సినిమా నుండి తప్పుకుంది.

సమంత గర్భవతి కావడం వల్లే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు కోలీవుడ్ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై అక్కినేని ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు స్పందిస్తే మాత్రమే ఈ వార్త నిజమో అబద్ధమో తెలిసే అవకాశం ఉంది. దాదాపు రెండేళ్ల క్రితం నాగచైతన్య, సమంత ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.



అహ్మద్ పటేల్ కు నోటీసులు.. ఇక వరుసలో ఉన్న చంద్రబాబేనా..?

తెలంగాణ బడ్జెట్ - హరీశ్ రావుకు తొలిసారి ఆ ఛాన్స్..!

దేవుడా... ఈ చంద్రబాబుకు ఏమైంది.. - అంతగా ఎందుకు భయపడుతున్నాడు...?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald