Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అలాంటి సమస్యతో బాధపడుతున్న మంచు లక్ష్మి..!

అలాంటి సమస్యతో బాధపడుతున్న మంచు లక్ష్మి..!

మోహన్ బాబు కూతురుగా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది నటి మంచు లక్ష్మి. ఇక తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించి మెప్పించిన మంచు లక్ష్మి ప్రస్తుతం బాలీవుడ్ వైపుగా ఫోకస్ చేసి అక్కడ పలు సినిమాలలో, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
తెలుగులో మొదటిసారిగా అనగనగా ఒకదీరుడు అనే చిత్రం ద్వారా పరిచయమైంది ఆ సినిమాలో ఈమె విలన్ పాత్రలో నటించింది. నటనకు మంచి మార్కులే పడ్డ కాని సినిమా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటిస్తోంది.

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యులో మంచు లక్ష్మి మాట్లాడుతూ అనగనగా ఒకదీరుడు సినిమా చేస్తున్న సమయంలో తనకి ఒక ఆరోగ్య సమస్య వచ్చిందని దాంతో ఇప్పటికి తాను బాధపడుతున్నానని తెలియజేసింది. అనగనగా ఒకదీరుడు
సినిమా కోసం తాను మూడు గంటలపాటు మేకప్ వేసుకునే దాన్ని అలాగే తాను వేసుకొనే దుస్తులు కూడా బరువు ఎక్కువగా ఉన్న వాటిని మోసాను, మేకప్ తీసేస్తుంటే చాలా కష్టంగా ఉండేది. ఆ మేకప్, డ్రెస్, ఆభరణాల వల్ల తనకు మెడ నొప్పి వచ్చిందని తెలిపింది. అప్పుడు వచ్చిన ఆ మెడ నొప్పి ఇప్పటికే కూడా అలాగే ఉందని తెలియజేసింది.

అలాగే స్పాండిలైటిస్ కూడా వచ్చిందని అది ఇంకా ఇప్పటికి పోలేదు. దీంతో చాలా బాధపడుతున్నానని వెల్లడించింది మంచు లక్ష్మి. 2011లో అనగనగా ఒక ధీరుడు
సినిమా విడుదల అయింది అంటే సుమారుగా ఇప్పటికీ 15 సంవత్సరాలుగా మంచు లక్ష్మి స్పాండిలైటిస్ అనే సమస్యతో ఇబ్బంది పడుతోంది. మంచు లక్ష్మి చివరిగా తెలుగులో దక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక తమిళంలో పూకి అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం అయితే లేచింది మహిళా లోకం అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. మంచు లక్ష్మి నిర్మాతగా కూడా తల చిత్రాలను తెరకెక్కించింది.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald