తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన వార్తల్లో త్రిష పేరు మరోసారి ప్రముఖంగా వినిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రపంచనాయకుడు కమల్ హాసన్ కలిసి నటించబోతున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రముఖ దర్శకుడు నెల్సన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా త్రిష నటించనుందనే వార్తలు కొద్ది రోజులుగా కోలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు త్రిషకు దాదాపు రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. కెరీర్ పీక్‌లో కొనసాగుతున్న త్రిషకు ఇది మరో భారీ అవకాశం అవుతుందని అభిమానులు భావించారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
దీనికి ప్రధాన కారణంగా రాజకీయ అంశాలే వినిపిస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న 'రెడ్ జెయింట్ మూవీస్' సంస్థ తమిళనాడు మాజీ సీఎం కుటుంబానికి చెందినది కావడం . అలాగే కమల్ హాసన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాతగా వ్యవహరిస్తుండటం ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది. ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాలో నటించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని

తమిళ స్టార్ హీరో సీఎం విజయ్.. త్రిషకు సూచించినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే విజయ్, త్రిష మధ్య ఉన్న సన్నిహిత సంబంధంపై ఎన్నో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని అభిమానులు ఎప్పటినుంచో మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ చెప్పిన మాటకు ప్రాధాన్యం ఇచ్చి త్రిష ఈ ప్రాజెక్ట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందనే వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి. కొందరు దీనిని ప్రేమకు నిదర్శనంగా చెప్పుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని అంటున్నారు.
అయితే ఇప్పటివరకు ఈ విషయంపై

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri