Thursday, 04 Mar, 9.00 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీకి వరస విజయాలతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈమె నటించిన తొలి మూడు సినిమాలు విజయం సాధించాయి. ప్రేమమ్, అఆ.., శతమానం భవతి లాంటి సూపర్ హిట్స్‌తో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అనుపమ.. ఆ తర్వాత మాత్రం అదే జోరు చూపించడంలో విఫలమైంది. మధ్యలో రాక్షసుడు, హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాలు పర్లేదు అనిపించాయి కానీ అనుపమ కెరీర్‌ను మార్చేసే సినిమాలు మాత్రం కాదు.

దీంతో ఆమె చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ టాక్ తెచ్చుకొని సరైన గుర్తింపుని ఇవ్వలేకపోయాయి.అనుపమ చివరిగా రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా నటించింది. తరువాత తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో సొంత బాషలో సినిమాలు చేస్తుంది.అక్కడ నటిగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా ఈ అమ్మడు ఓనమాలు నేర్చుకుంది. ఇదిలా ఉంటే మరల అనుపమ నిఖిల్ కి జోడీగా 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా ఖరారు అయ్యింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది.

అయితే ఈమె ఇండస్ట్రీకి వచ్చిన ఈ ఐదేళ్ళలోనే దాదాపు 10 సినిమాల్లో నటించే అవకాశం మిస్ చేసుకుంది. కొన్ని పారితోషికం కారణంగా.. మరికొన్ని అనివార్య కారణాలతో వదిలేసుకుంది అనుపమ. మరికొన్ని మాత్రం డేట్స్ ఇచ్చి కూడా మధ్యలో కొన్ని క్లాషెస్ వచ్చి బయటికి వచ్చేసింది. అలా అనుపమ చేజారిన 10 సినిమాల లిస్టు ఏంటో చూద్దాం. నాని నటించిన నేను లోకల్ సినిమా, శర్వానంద్ మహానుభావుడు, రామ్ చరణ్ రంగస్థలం, నితిన్ ఛల్ మోహన్ రంగా, ఎన్టీఆర్ అరవింద సమేత, బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్ ఇస్మార్ట్ శంకర్ (నభా నటేష్ పాత్ర), నిఖిల్ అర్జున్ సురవరం, నాని వి (అదితిరావు హైదరీ పాత్ర), అనుష్క నిశ్శబ్ధం సినిమాలో షాలిని పాండే పాత్రని అనుపమ వదిలేసుకుంది.

భర్త క్రాఫ్ చూసి ఆనందపడిన భార్య.. కానీ అంతలోనే..?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

షర్మిలను మోసం చేసిన జగన్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top