Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అతనిని నమ్మి మోసపోయా.. బ్రేకప్ పై అనన్య నాగళ్ల కామెంట్స్..!

అతనిని నమ్మి మోసపోయా.. బ్రేకప్ పై అనన్య నాగళ్ల కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిగా పేరు సంపాదించింది హీరోయిన్అనన్య నాగళ్ల. తన అందంతో అభినయంతో సోషల్ మీడియాలో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
మొదట కొన్ని రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నటన పైన ఆసక్తి ఉండడంతో పలు రకాల షార్ట్ ఫిలింలో నటించింది. ఆ తర్వాత మల్లేశం అనే సినిమాతో వెండితెరకు పరిచయమై అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. వకీల్ సాబ్, మ్యాస్ట్రో, శాకుంతలం, మళ్లీ పెళ్లి, డార్లింగ్, పొట్టేల్ తదితర సినిమాలలో నటించింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూ కి హాజరై తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంది. ఇటీవల కాలంలో ఏ విషయం పైన ఏడ్చారు అంటూ యాంకర్ ప్రశ్నించగా? అందుకు
అనన్య చాలా ఏళ్ల తర్వాత తను బాగా ఏడ్చాను అది కూడా ఒక వ్యక్తి లవ్ బ్రేకప్ అవ్వడం వల్లే అంటూ తెలియజేసింది. ఆ వ్యక్తిని చాలా నమ్మాను కానీ మోసపోయాను. ఉదయం లేవగానే అవే ఆలోచనలు వెంటాడాయి, ఎంత బిజీగా ఉన్నా అవే ఆలోచనలే గుర్తుకు వచ్చేవి, అలా బ్రేకప్ బాధను మూడేళ్ల పాటు అనుభవించానని తెలియజేసింది.

షూటింగ్లో ఎన్నోసార్లు క్యార్వ్యాన్లో కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలకు కూడా ఇలాంటివే ఎదుర్కొంటారు అమ్మాయిలు చాలా సెన్సిటివ్, అబ్బాయిలే వదిలేసి వెళ్లిపోతారని చాలామంది సోషల్ మీడియాలో మిమ్స్ చేస్తూ ఉంటారు. ఎన్నో మాటలు అంటూ ఉంటారు. అలా ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువగా అబ్బాయిలే కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండడం వల్ల ఆ పాయింట్ ఆఫ్ లోనే వ్యూస్ బయటకి వస్తూ ఉంటాయి, మన పాయింట్ ఆఫ్ యూస్ బయటికి రావడం లేదంటూ
అనన్య తెలియజేసింది.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald