ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్.. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎన్నో వినోదత్మాక సినిమాలు చేసి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించాడు. ఇక సుదీర్ఘ విరామం తరువాత ఇప్పుడు తాజాగా అల్లరి నరేష్ హీరోగా పూజా జవేరి హీరోయిన్ గా.. 'ఏ.టీవీ' సమర్పణలో 'ఏకే ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం 'బంగారు బుల్లోడు'. ప్రభాస్ శ్రీను, భద్రం, నటి రజిత వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నిజానికి 2 ఏళ్ళ క్రితమే విడుదల కావాల్సి ఉంది.
కనీసం ఓపెనింగ్స్ కూడా అతని చిత్రాలకు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ విషయం 'బంగారు బుల్లోడు' తో మరోసారి ప్రూవ్ అయ్యింది.గత శనివారం రోజున విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో మినిమం ఓపెనింగ్స్ కూడా నమోదవ్వలేదు.నిన్న అంటే రిపబ్లిక్ డే హాలిడే ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది ఈ చిత్రం. ఇక వసూళ్ల విషయానికి వస్తే...'బంగారు బుల్లోడు' సినిమాకి 3.5కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 4కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 1.52 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి మరో 2.48 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నిన్న ఈ చిత్రం కేవలం 0.23 కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేసింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...
హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుపతి ఉపఎన్నికతో చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ?
జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?
జగడ్డ: సాయిరెడ్డి పప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడకడం లేదే..!
అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?
జగడ్డ: నువ్వా-నేనా: సర్కారుకు నిమ్మగడ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!
జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?
టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay

