Friday, 22 Jan, 4.00 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
బెంజ్ లో కొత్త మోడల్ కారు వచ్చేసింది.. ప్రత్యేకతలు ఇవే..

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు..
బెంజ్ కారు అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. రిచ్ కార్లలో ఒకటి.. ఈ కంపెనీ ఇప్పటికే ఎన్నో కార్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. వాటికి మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. కాగా, ఈ తయారీ సంస్థ మెర్సిడెస్‌-బెంజ్‌ బుధవారం తన ఎస్‌యూవీ విభాగం లో 2021 జీఎల్‌సీ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.57.40 లక్షలుగా ఉండే ఈ కారు రెండు వేరియంట్ల లో లభిస్తుంది. జీఎల్‌సీ 200 పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.57.40 లక్షలుండగా, జీఎల్‌సీ 200డి డీజిల్‌ వేరియంట్‌ ధర రూ. 63.15 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

ఈ కారు సరికొత్త ఫీచర్లతో వచ్చింది. ఆ కారు ప్రత్యేకతను పరిశీలిస్తే..అలెక్సా హోమ్, గూగుల్‌ హోమ్, 360 డిగ్రీ కెమెరా, నావిగేషన్‌ సిస్టమ్‌తో పాటు పార్కింగ్‌ లొకేషన్‌లు కనుకొనే ''మెర్సిడెస్‌ మీ కనెక్ట్‌'' అనే అధునాతన ఫీచర్లు కలిగిన యాప్‌ను పొందుపరిచారు. ముందు బెంజ్ కార్లలో వచ్చిన అన్ని ప్రత్యేకతలు ఈ కారులో కూడా ఉన్నాయని అంటున్నారు. డ్రైవింగ్ ను రిమోట్ సాయంతో కూడా ఆపరేట్ చేయవచ్చు అని అంటున్నారు.

రిమోట్‌ సాయంతో ఇంజిన్‌ను ప్రారంభించే సదుపాయం ఉంది. ఇందులో ఫ్రంట్‌ సీట్లను మసాజ్‌ ఫంక్షన్‌తో తయారు చేశారు. మెర్సిడెస్‌ బెంజ్‌ భారత ఉత్పత్తుల లైన్‌అప్‌లో ఈ తరహా సదుపాయాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ''బెంజ్‌ ఎస్‌యూవీ విభాగం లో జీఎల్‌సీ మోడల్‌ మూలస్తంభంగా నిలిచింది. గతేడాది మా పోర్ట్ ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది అని మెర్సిడెస్‌-బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్‌ ష్వెంక్‌ ఈ సందర్బంగా తెలిపారు.. ఇప్పుడు మార్కెట్ లోకి విడుదల చేసిన కార్లు కూడా మంచి డిమాండ్ తో దూసుకుపోతున్నాయి.

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఢిల్లీలో ఉద్రిక్తతలకు కారణాలు ఏమిటి ?

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జగన్ వైసీపీ కమ్మల సీట్లకు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top