Saturday, 23 Jan, 12.22 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
బిగ్ బాస్ లో అలాంటివి చేయమంటారా ..... షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన హారిక... ??

ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై కొనసాగుతున్న క్రేజీ షోల్లో బిగ్ బాస్ షో కూడా ఒకటి అనే చెప్పాలి. ఇటీవల ప్రసారమైన సీజన్ 4 కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో పాటు భారీ రేటింగ్స్ కూడా దక్కాయని అంటున్నారు విశ్లేషకులు. స్టార్ మా ఛానల్ కొన్నాళ్లుగా ప్రసారం చేస్తున్న ఈ షో యొక్క 4వ సీజన్ కి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి షో ని మరింత ఆసక్తికరంగా ముందుకు నడిపించారు.

ఈ సీజన్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజీత్ విన్నర్ గా నిలవగా, అఖిల్ సార్థక్ రన్నర్ గా నిలిచాడు. ఈ షో లో ఫిమేల్ కంటెస్టెంట్ గా ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకున్న అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేత్తడి హారిక పేరుతో యూట్యూబ్ లో మంచి ఫెమస్ అయిన హారిక గురించి ప్రస్తుత యువత చాలా మందికి సుపరిచితం. అయితే హౌస్ లో మంచి పెర్ఫార్మన్స్ కనబరిచిన హారిక ఇటీవల షో ముగిసిన అనంతరం ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో ఎక్కువగా టచ్ లో ఉంటోంది.

అలానే పలు మీడియా ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూ లు ఇచ్చిన హారిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ, బిగ్ బాస్ షో లో ఫిమేల్ కంటెస్టెంట్స్ ని పొట్టి దుస్తులు ధరించమని నిర్వాహకులు అడుగుతారట కదా నిజమేనా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు హారిక ఒకింత షాకింగ్ గా సమాధానం ఇచ్చారు. అసలు ఇటువంటి పుకార్లు ఎవరు లేవనెత్తారో, ఎందుకు ప్రచారం చేస్తారో తెలియదని, నిజానికి తన దగ్గరకు వచ్చి మీరు పొట్టి దుస్తులు వేసుకోండి అంటూ బిగ్ బాస్ షో వారు ఎవరూ కోరలేదని, అలానే మిగతా ఇతర ఫిమేల్ కంటెస్టెంట్స్ ని కూడా వారు అడిగి ఉంటారు అని నేను అనుకోను అన్నారు. ఈ షో ఏ మాత్రం స్క్రిప్టెడ్ కాదని, అంతా నిజమేనని కూడా ఆమె చెప్పడం జరిగింది....!!

భార్యా భర్తల శృంగార వీడియోలను సేకరించిన కేటుగాడు..చివరికి

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మణ ఘోష: బ్రాహ్మణులకు మాట ఇచ్చి మరచిన జగన్‌... !

బీజేపీకి జనసేన దూరమౌతుందా..?

పంచాయతీ ఎన్నికలతోనే వైసీపీ పతనం!

కాపు వేదన: నాయకత్వం వహించేదెవరు? చిరు, పవన్‌ ఫేడ్ అవుట్.. !

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top