Monday, 17 May, 1.00 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
బుల్లిపిట్ట : ఇకపై స్కానర్ తో పనేముంది..

దిగ్గజ టెక్ సంస్థల్లో ఒకటైనటువంటి గూగుల్ మరొక కొత్త యాప్ ను విడుదల చేసింది. దీని ద్వారా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కాన్ చేయడంతోపాటు వాటి స్టోరేజీ, వాటి నిర్వహణకు కొత్త యాప్ ను సంస్థ అభివృద్ధి చేసింది. ఆ యాప్ పేరు స్టాక్ యాప్.

ఈ యాప్ ను గూగుల్ చెందిన ఏరియా 120 డివిజన్ విభాగంలో అభివృద్ధి చేసింది. ఈ యాప్ ఆర్టిఫిషియల్, ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే స్కానర్ యాప్. స్మార్ట్ ఫోన్ కెమెరా ద్వారా డాక్యుమెంట్లు, బిల్లులు వివిధ రకాల వస్తువులను స్కాన్ చేసుకోవచ్చు. వీటిని యూజర్లు భద్రపరచుకునేందుకు వివిధ కేటగిరీల వారీగా ఆటోమేటిక్ గా సేవ్ చేస్తుంది. వీటిని యూజర్లు సేఫ్ గా భద్రపరుచుకోవచ్చు. ఇందుకు గూగుల్ కు చెందిన లాంగ్వేజ్ రికగ్నిషన్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ వంటివాటిని ఈ యాప్ ఉపయోగిస్తుంది. అలాగే యాప్ ద్వారా స్కాన్ చేస్తే డాక్యుమెంట్లలోని అకౌంట్ నెంబర్లు, బిల్లుల బకాయిలు, గడువు తేదీల వంటివాటి ముఖ్యమైన వివరాలను ఈ యాప్ గుర్తిస్తుంది. మనం కట్టవలసిన గడువు తేదీలను గురించి యూజర్లను అలర్ట్ కూడా చేస్తుంది. ఈ యాప్ ద్వారా డాక్యుమెంట్ల కాపీలను గూగుల్ డ్రైవ్ కు ఎక్స్ పోర్ట్ చేసి, సేవ్ చేసుకోవచ్చు.

గూగుల్ స్కానర్ యాప్ ను మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించారు. ఈ యాప్ ను బయోమెట్రిక్ ద్వారా లేదా ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా యాప్ లాక్ చేయవచ్చు. ఈ ఎక్స్పెరిమెంటల్ యాప్ ను గూగుల్ కొనసాగిస్తుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం అమెరికాలోని ఆండ్రాయిడ్ యూజర్లకు దీన్ని అందుబాటులో ఉంచారు. ఈ యాప్ ను ఇతర దేశాల యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయంపై గూగుల్ ఏ విధంగా స్పందించలేదు. ప్రస్తుతం ఇది అమెరికా యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం క్యాం స్కానర్, అడోబ్ స్కాన్ వంటి డాక్యుమెంట్ స్కానింగ్ యాప్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఒకవేళ ఈ గూగుల్ స్టాక్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తే... ఇతర పోటీ సంస్థలకు ఇది గట్టిపోటీ ఇవ్వనుంది. ఇప్పటి వరకు ఉండే స్కానింగ్ యాప్ లు A1 సామర్ధ్యాలతో పనిచేయట్లేదు. అందువల్ల విస్తృత ఫీచర్లు ఉన్న స్టాక్ యాప్ ఇతర యాప్ లపై పైచేయి సాధించే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్లారిటీ వచ్చేదాకా కామ్ గా ఉండాలిసిందే అంటున్నారు..... ??

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

'బ్రహ్మాస్త్ర' ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top