Friday, 26 Feb, 1.00 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
"బుల్లిపిట్ట " : న్యూ మోడల్ బైక్..ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు.. 225 కి. మీ. మైలేజ్..!

ప్రస్తుతంకాలంలో బైక్ అనేది అతి సాధారణం. అందరి దగ్గర ఇప్పుడు బైకులు ఉండనే ఉంటాయి. బైకు లేని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు అమాంతం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు పెట్రోల్ కొట్టించుకోలేనంతగా ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల హావా చెలరేగిపోతోంది.

ఇక ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు కంపెనీ శ్రీవారు మోటార్స్ లాంచ్ చేసిన 'ప్రాణా 'ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. కుర్రాళ్ళను ఆకట్టుకునే విధంగా స్టైలిష్ లుక్ తో ఇది మార్కెట్లోకి వచ్చింది. బ్యాటరీ సహాయంతో నడిచే ఈ వెహికల్ మైలేజ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఏకంగా 225 కిలోమీటర్ల వరకు వెల్లవచట. ఈ ప్రాణ వెహికల్ కి చార్జింగ్ చేయటానికి కేవలం 4 గంటల 15 నిమిషాలు సమయం పడుతుందట. అంతేకాకుండా నాలుగు సెకండ్లలో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందట. గరిష్టంగా ఈ బైకు గంటకు 120 మూడు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. నిథిన్ అయాన్ బ్యాటరీల ను వినియోగించి, బ్యాటరీ ని రెండు వేల సార్లు ఛార్జ్ చేసుకోవచ్చని.. కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ బైకు మూడు వేరియంట్లలో లభిస్తుందట. గ్రాండ్ వేరియంట్ ధర రూ.1,99,999. ఎలైట్ బైక్ ధర రూ.2,74,999. ఇవి ఓన్లీ ఎక్స్ షోరూమ్ ధరలే. క్లాస్ మోడల్ ధరను ఇంకా ప్రకటించలేదు. అంతేకాకుండా ఈ బైక్ వల్ల పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చట .

ముఖ్య గమనిక :
శ్రీవారి మోటార్స కంపెనీ వారు ప్రకటించింది ఏమిటంటే..ఏదైనా ఒక ప్రదేశంలో పది మొక్కలు నాటితే రూ.25,000 రూపాయలను డిస్కౌంట్ గా కూడా ఇస్తారట. ఈ బైక్ ను బుక్ చేసుకోవాలంటే కంపెనీ వెబ్సైట్లో రూ.1,999 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బైక్ బుక్ చేసిన అనంతరం 45 రోజుల్లో బైక్ డోర్ డెలివరీ చేయబడుతుంది. ఈ బైకు వచ్చే ఏడాది లోపల అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ వారు తెలిపారు.

కమెడియన్ సత్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..?

రిలీజ్ డేట్స్ ఇచ్చేశారు.. బొమ్మ పడినట్లేనా ?

రికార్డు స్థాయిలో ఐయండిబి రేటింగ్ సాధించిన షాదీ ముబారక్....

విశాఖ ఉక్కు ఉద్యమానికి అండగా నిలిచిన టాలీవుడ్ సెలెబ్రిటీలువీళ్ళే.. మరి స్టార్ హీరోల సంగతేంటి..??

పుర పోరు : విశాఖలో అపార్ట్ మెంట్లు కదిలాయి.. ఎవరికి షాక్...?

భార్యల కోసం నిర్మాతగా మారిన హీరోలు వీరే..

టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి రెడీ అయిపోయిన బాలీవుడ్ అందాల భామలు వీరే..!

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top