Friday, 24 Sep, 1.00 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
బుల్లిపిట్ట: రూ.40వేలకే టూవీలర్ బైక్.. మైలేజ్ 60KM..!

ప్రత్యుత్తరం ఇప్పుడు ప్రతి ఒక్కరికి టూ వీలర్ అవసరము చాలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక చవకైన ధరకే డీటెల్ సంస్థ ఒక సరికొత్త టూవీలర్ ను లాంచ్ చేసింది. ఈ బైక్ ను.. రూ..39,999 కే మనకు అందిస్తోంది. ఇక మొత్తం జీఎస్టీ కలుపుకొని.. రూ.41,999 లభిస్తుంది. ఇందులో కేవలం రెండు కలర్స్ మాత్రమే విడుదల చేసింది. ఇక ఈ బైక్ ను బుక్ చేసుకోవాలంటే ముందుగా టోకెన్ కు.. రూ.1.999 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవాలి. మిగతా డబ్బులు డెలివరీ వారం ముందు చెల్లించవలసి ఉంటుంది.

ముందుగా ఈ టూ-వీలర్ లను హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. అక్కడ వీరికి డీలర్షిప్ ఉన్నందువలన కేవలం మొదటి సారి అక్కడి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అధికారిక వెబ్సైట్లో తెలియజేసింది. భవిష్యత్తులో దేశమంతట తమ నెట్వర్క్ ను విస్తరింప చేస్తున్నాము అన్నట్లుగా తెలియజేశారు. ఇక ఈ బైక్ 60 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు సమాచారం. గంటకు 25 కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్ళగలదట. ఇక ఈ బైక్ కి 20MAH బ్యాటరీ కలదు.

ఇక వీటి టైర్లు డ్రం బ్రేక్ సిస్టం తో రూపొందించబడినవి. అందువల్ల ఇవి 170 కేజీల వరకు బరువును మోయగలవు. ఈ బైక్ కు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా అందించనుంది. అంతేకాకుండా EMI పద్ధతి ద్వారా కూడా ఈ టూ వీలర్ ను మనం కొనుక్కోవచ్చు.

ఇక ఈ వాహనంపై.. డీటెయిల్ వ్యవస్థాపకుడు డాక్టర్ యోగేష్ భాటియా తెలియజేయునది ఏమనగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ను విస్తరింప చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలియజేశారు. ఇక ఈ కంపెనీ నుంచి అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించిన ఈ టూ వీలర్ అతి తక్కువ ధరకే అందిస్తున్నాము అంటూ తెలియజేశాడు. ఇక అంతే కాకుండా భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ టూవీలర్స్ కే డిమాండ్ పెరుగుతుండడంతో.. వాటిని దృష్టిలో పెట్టుకొనే మరిన్ని వాహనాలను త్వరలో విడుదల చేస్తామని తెలుపుతూ వచ్చారు.

రాహుల్ పర్యటలో మర్మమేంటి ?

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆ హీరోలంతా వెనకడుగు వెస్తారా..?

మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్..!

చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో..!

బూస్టర్‌డోస్ అవసరమేనా?

అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా?

పుష్పలో రష్మిక ఫస్ట్ లుక్‌

బ్రేకింగ్: బండి పాదయాత్రకు బ్రేక్...?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top