ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఐదు జిల్లాల్లో ఆయన ప్రచారం చేయబోతున్నారు. తన సొంత జిల్లా చిత్తూరు నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు చంద్రబాబు.
అయితే మున్సిపల్ ప్రచారానికి వెళుతున్న చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు చిత్తూరు జిల్లాకే మొదటగా వెళుతుండగా..
అయితే మున్సిపల్ ప్రచారానికి వెళుతున్న చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు చిత్తూరు జిల్లాకే మొదటగా వెళుతుండగా..
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. పుంగనూరులోని 31 వార్డులకు వైసీపీ నుంచి మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో అక్కడ పోలింగ్ నిర్వహించే అవకాశమే లేకుండా పోయింది. పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 18 వార్డులు, మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 15 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఎమ్మెల్యే రోజా నియోజకవర్గమైన నగరిలోనూ 7 వార్డులను వైసీపీ పోటీ లేకుండానే కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను వైసీపీ పోలింగ్ కు ముందే గెలుచుకోగా.. చంద్రబాబు ప్రచారం చేసి ఉపయోగం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సొంత జిల్లాలో పార్టీ అభ్యర్థులను పెట్టకపోవడం చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందిగా మారిందనే చర్చ వస్తోంది.
ఆదిపురుష్‌లో సీతమ్మగా ఆ అమ్మడు ఫిక్స్...
పుర పోరు: పశ్చిమలో ఆ ఒక్క మహిళతో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!
పురపోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జన్యాలు.. ఏకగ్రీవాలు
క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?
అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?
ఆ ఎమ్మెల్యే మనిషిగా వైసీపీలో.. మనసంతా టీడీపీలో ?
పుర పోరు: గుంటూరులో రెండు మున్సిపాల్టీల్లో వైసీపీ స్వీప్... టీడీపీకి గుండు సున్నా
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA

