Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చంద్రబాబుకు మెడకు చుట్టుకుంటున్న కేసులు !

చంద్రబాబుకు మెడకు చుట్టుకుంటున్న కేసులు !

చంద్రబాబు మీద ఇప్పటికే చాలా కేసుల మీద స్టే నడుస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఇంత వరకు ఆ కేసులు విచారణ దాకా వచ్చిన దాఖలు లేవు. అయితే ఇప్పుడు ఆ కేసుల మీద స్టే ఎత్తివేస్తూ కోర్ట్ తీర్పునిస్తూ .. విచారణకు ఆదేశించింది. కానీ వీటిన్నంటిని దాచేందుకు పచ్చ మీడియా తెగ ప్రయత్నం చేస్తుంది. అక్రమాస్తుల వ్యవహారంలో పద్నాలుగు సంవత్సరాల కిందట చంద్రబాబుగారి అత్తగారు నందమూరి లక్ష్మిపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ఇన్నేళ్లూ స్టేలో ఉండటం - ఇప్పుడు ఆ వ్యవహారంపై విచారణకు కోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. అసలే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వాసంలో ఉన్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది ఇరవై మూడు సీట్లు మాత్రమే - అంతటి దారుణ పరాజయం తర్వాత పరిణామాలు అంతే కఠినంగా ఉంటున్నాయి చంద్రబాబు నాయుడుకు.

అయితే ఇంకో పక్క టీడీపీలో భవిష్యత్ నాయకుడు ఎవరనేది ఇంకా తేలడం లేదు. పార్టీ పగ్గాలను చేపట్టే సత్తా .. సామర్ధ్యం లోకేష్ కు లేవన్నది భహిరంగ రహస్యం. అంతకు మించి అతడు తెలుగుదేశం పార్టీని వీడాలనుకునే వారికి వరంగా మారుతూ ఉన్నాడు. ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఉంటారు? అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇప్పటికే ఒక రాజీనామా చోటు చేసుకుంది. మరి కొందరు బీజేపీకి టచ్ లో ఉన్నారనే ప్రచారం సాగుతూ ఉంది. త్వరలోనే చంద్రబాబుకు కనీస ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతుందనే స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఉన్నట్టుండి ఉరుము లేని పిడుగులా పాత కేసు పై స్టే తొలగిపోయింది. అది కూడా ఈ నెలలోనే విచారణ మొదలుకానుందట!

అయితే జగన్ మీద ఉన్న కేసుల కారణంగా చంద్రబాబు ఎప్పుడు జగన్ నేరస్తుడు అని చెప్పుకొచ్చేవాడు. ఇన్నాళ్లూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు రకరకాలుగా విమర్శిస్తూ వచ్చారు. ఆయన కోర్టు వెళ్తారని - జైలుకు వెళ్తారని అంటూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేయాల్సి వస్తే.. జగన్ మీద విమర్శించడానికి టీడీపీకి ఉన్న ఏకైక ఆయుధం కూడా పోయినట్టే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald