Dailyhunt
చిరంజీవి కౌబాయ్ లుక్ .. 'కొదమసింహం'కు 30 ఏళ్లు..

చిరంజీవి కౌబాయ్ లుక్ .. 'కొదమసింహం'కు 30 ఏళ్లు..

సినిమాల్లో మాస్, క్లాస్ కథలకు భిన్నంగా ఉండేవి 'కౌబాయ్' కథలు. గుర్రపు స్వారీలు, చేసింగ్ లు, గోల్డ్ హంట్, నటీనటుల మేకోవర్, మ్యూజిక్, ఆర్ట్ డిజైనింగ్.. ఇలా ప్రతీ విభాగంలో 'కౌబాయ్' సినిమాలు ప్రత్యేకత చాటుకుంటాయి. ఈ కథలతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకునే సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'కొదమసింహం'. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించి. ఈ సినిమా విడుదలై నేటికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1990 ఆగష్టు 9న విడుదలైంది.
 చిరంజీవే ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.
ఆయన లుక్, యాక్టింగ్, మేనరిజమ్, ఫైట్స్, సిగార్ కాల్చే స్టైల్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కౌబాయ్ సినిమాల్లో ఉండే నిధుల వేటతోపాటు తల్లిదండ్రుల సెంటిమెంట్ కూడా ఉండటం ఈ కథలో ప్రధాన ఆకర్షణ. సుడిగాలి పాత్రలో మోహన్ బాబు పండించిన కామెడీ సినిమా హిట్ లో కీలకంగా వ్యవహరించాడు. దర్శకుడు కె.మురళీమోహన్ రావు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. చిరంజీవిని స్టైలిష్ గా చూపించడమే కాకుండా సినిమా మొత్తం కౌబాయ్ ఫీల్ వచ్చేలా తీసి సక్సెస్ అయ్యారు. రమా ఫిలింస్ బ్యానర్ పై కైకాల సత్యనారాయణ ఈ సినిమాను అప్పట్లో భారీ ఖర్చుతో తెరకెక్కించారు.

 రాజ్-కోటి సంగీతం సినిమాకు ప్రాణం. పాటలన్నీ సూపర్ హిట్టయి చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 'స్టార్ స్టార్ మెగాస్టార్' పాట సినిమాకే హైలైట్. 'కొదమసింహం'ను హాలీవుడ్ లో 'హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ' పేరుతో డబ్ చేశారు. హీరోయిన్లుగా సోనమ్, రాధ నటించారు. వాణి విశ్వనాధ్ ప్రత్యేకపాత్రలో నటించింది. ఈ సినిమా 20 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. చిరంజీవి ఆల్ టైమ్ ఫేవరెట్స్ లో ఒకటిగా 'కొదమసింహం' నిలిచింది. మెగాభిమానులకు ఈ సినిమా ఎప్పుడూ ప్రత్యేకమే.


3 రాజధానులకు ముహూర్తం ఫిక్స్.. ప్రధానికీ ఆహ్వానం..!.. ఎప్పుడంటే..?

మోడీ చేతులెత్తేశారా...అన్యాయమేగా ?

500 కోట్ల అవినీతికి కేసీఆర్ బ్రేక్... ఎలాగో తెలుసా?

జూమ్‌..జూమ్‌..డౌట్ : కొంపదీసి.. అది చంద్రబాబు డూప్ కాదు కదా..?

శవాల మీద పేలాలు ఏరుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు.. చివరికి కరోనాను కూడా మార్ఫింగ్‌ చేస్తున్నారట.. ?

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త... నేడే బ్యాంక్ ఖాతాల్లోకి 17 వేల కోట్ల రూపాయలు...?

తూర్పు గోదావరి మరో న్యూయార్క్ అయిపోయిందా...?

ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Murali
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald