Friday, 01 Nov, 10.22 pm ఎ పి హెరాల్డ్

ముఖ్యాంశాలు
చిరు సినిమాలో త్రిష లేదా..మరి హీరోయిన్ ఎవరు ?

చిరంజీవి, కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దసరాకు లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం కోసం అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార, శృతిహాసన్, తమన్నా, అనుష్క లాంటి పెద్ద హీరోయిన్ల పేర్లు వినిపించాయి.



సైరా హిట్ తరువాత తమన్నానే ఈ సినిమాలో హీరోయిన్ అని అందరు అనుకున్నారు కూడా. అయితే, స్టాలిన్ సినిమా తర్వాత చిరు త్రిషతో నటించాలని అనుకోవడంతో ఈ సినిమాలో చెన్నై బ్యూటీ హీరోయిన్ అనే మాటలు బాగా వినపడ్డాయి. మొన్న ఆమధ్య ఈ సినిమాలో త్రిష నటిస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ త్రిష ఈ చిత్రంనుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది.

తాను చిరంజీవితో ఈ సినిమాలో నటించడంలేదని చెప్పుకొచ్చింది. ఆ సినిమా దర్శక నిర్మాతలు కనుక నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాని ఈ బ్యూటీ అంటుంది. గతంలో సినిమా యూనిట్ త్రిషతో సంప్రదింపులు జరిపినమాట వాస్తవమే. అయితే రెమ్యూనరేషన్ విషయంలో కుదరలేదో, మరి ఇంకే కారణావల్ల వీలుకాలేదో.. మొత్తానికి త్రిష ఈ చిత్రం నుంచి ఔట్ అయింది. త్రిషనే హీరోయిన్ అని అనుకుంటున్న నేపథ్యంలో, ఆమె పక్కకు తప్పుకోవడంతో కొరటాలకు మల్లి పనిపడింది.

సినిమా ముహూర్తం అయితే ప్రారంభం అయింది కానీ, చిరు లాంటి పెద్ద స్టార్ పక్కన నటించడానికి ఏ హీరోయిన్ ను తెరమీదకు కొరటాల తెస్తారా అని అందరు ఆలోచనలో పడ్డారు. ముందుగా అనుకున్న విదంగా చివరకు తమన్నా సెట్స్ పై కనిపిస్తుందని వార్తలు సినీ ఇండస్ట్రీలో వినపడుతుంది. ఏది ఏమైనా చిరు ఈ వయసులో కూడా గ్యాప్ లేకుండా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయితే కానీ, హీరోయిన్ తెరపై రాదని అర్థమవుతుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top