Friday, 30 Jul, 9.00 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
దక్షిణాఫ్రికాలో అగమ్యగోచరంగా మారిన భారతీయుల పరిస్థితి..!

కొద్దిరోజులు క్రితం దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా పోలీసులకు లొంగిపోయాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అతన్ని దర్యాప్తు కమిషన్ ముందు హాజరు కావలసిందిగా న్యాయస్థానం ఆదేశించింది. కానీ జాకబ్ న్యాయస్థానాన్ని దిక్కరించరాడు. దీంతో న్యాయస్థానం అతడికి 15 నెలల జైలు శిక్ష విధించింది. పోలీసులకు లొంగి పోకపోతే బలవంతంగా జైలుకు తరలించాలని పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. దీంతో అతడు పోలీసులకు లొంగిపోయాడు. అయితే, ఆ రోజు నుంచి ఈరోజు వరకూ దేశంలో అల్లర్లు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలను నియంత్రించలేక పోలీసులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 25 వేల మంది సైనికులను ప్రభుత్వం రంగంలోకి దింపింది. దీనితో పరిస్థితి కాస్త సద్ధుమణిగింది. అయితే, క్వాజులు-నాటాల్‌ ప్రావిన్సులో నివసిస్తున్న భారతీయులు మాత్రం అల్లరి మూక దాడి చేస్తుందేమోనని భయపడుతున్నారు. దీనికి కారణం సోషల్ మీడియాలో విపరీతమైన బెదిరింపులు రావడమేనని తెలుస్తోంది.

ఇండియన్ ఆరిజిన్ పీపుల్ కి గ్లోబల్ ఆర్గనైజేషన్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న రీటా అబ్రహం దక్షిణాఫ్రికాలోని భారతీయుల పరిస్థితిని వివరించారు. ప్రజాస్వామ్యం పై దాడి చేయడానికి దక్షిణాఫ్రికా ప్రజలు ముందస్తుగానే పక్కా ప్లాన్ రూపొందించారని ఆమె అన్నారు. పేదరికం, ఆకలి, ఆర్థిక పరిస్థితులు కూడా ఈ దాడులకు దారి తీసి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఆకలితో బాధపడే వారు దోపిడీలకు పాల్పడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. దోపిడీల కారణంగా చాలా మంది అమాయక ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారని ఆమె బాధను వ్యక్తం చేశారు.

అయితే దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయుల కోసం భారత ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి చర్యలు చేపట్ట లేదని ఆమె అన్నారు. ఏ భారతీయ అధికారి కూడా తమను ఆశ్రయించ లేదని ఆమె తెలిపారు. అయితే, భారత సంతతికి చెందిన వ్యక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లోబల్ ఆర్గనైజేషన్ 'ఇండియన్ డయాస్పోరా కౌన్సిల్' స్పందించింది. ఈ కౌన్సిల్ భారతీయ సంతతికి చెందిన ప్రజల సమస్యలను తెలియజేయడానికి దక్షిణాఫ్రికాలోని అనేక గ్రూపులతో చర్చలు ప్రారంభించింది.

ఇకపోతే కొద్ది రోజుల క్రితం స్టార్ట్ అయిన దాడుల కారణంగా చాలామంది ఆఫ్రికన్ ప్రజలు చనిపోయారు. ఒకేరోజు 26 మంది ప్రజలు చనిపోయారు.

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top