Thursday, 13 Aug, 11.00 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు హ్యాండిచ్చిన ప్రభాస్‌?

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం జిల్‌ ఫేం దర్శకుడు రాధాకృష్ణ మోహన్‌తో కలిసి పని చేస్తున్నారు. వారిద్దరి కాంబినేషన్‌లో త్వరలో రాధేశ్యామ్‌ రాబోతుంది. ఇదొక రొమాంటిక్‌ లవ్‌స్టోరీ. అందులో పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాధేశ్యామ్‌ తర్వాత మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమా సైన్సు ఫిక్షన్‌ డ్రామా నేపథ్యంలో రానునుంది. ఈ చిత్రానికి నిర్మాతగా వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ వ్యవహరించనున్నారు.

పద్మావత్‌ ఫేం దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించనుంది. ఈ పెద్ద బడ్జెట్‌ సినిమా పాన్‌ ఇండియా చిత్రంగా రానుంది. తాజాగా ప్రభాస్‌ తన 22వ సినిమాను కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నిల్‌ దర్శకత్వంలో నటించనున్నారని తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి డైరెక్టు చేసిన ఛత్రపతి, ప్రశాంత్‌ నిల్‌ దర్శకత్వంలో విడుదలైన ఉగ్రం చిత్రల్లో మాఫీయా లైన్‌ ఉంటుంది. బాహుబలి ప్రభాస్‌ మళ్లీ మాఫీయా డాన్‌గా కనిపించబోతున్నారు. దీనిపై అఫీషియల్‌గా ప్రభాస్‌ గానీ ప్రశాంత్‌ నిల్‌ గానీ ప్రకటన చేయలేదు. త్వరలో దీనిపై ఒక క్లారిటీ రానుంది.

అంటే ప్రభాస్‌ తన తదుపరి చిత్రం నాగ్‌ అశ్విన్‌తో కాకుండా కేజీఎఫ్‌ డైరెక్టర్‌తో చేయనున్నాడని తెలిసింది. ప్రశాంత్ నిల్‌ ఇటీవల యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసి స్టోరీ లైన్‌ చెప్పినట్లు తెలుస్తోంది. తెలిసిన సమాచారం మేరకు మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుందని దీనికి ప్రశాంత్‌ నిల్‌ దర్మకుడిగా పనిచేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రశాంత్‌ నిల్‌ ప్రస్తుతం యాష్‌ మరియు సంజయ్‌ దత్ లతో కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రం కేజీఎఫ్ ఊహించని విధంగా సూపర్‌హిట్ అందుకుంది. దర్శకుడు ప్రశాంత్ నిల్‌కు పేరును తెచ్చిపెట్టింది. సంజయ్‌దత్‌కు లంగ్‌ క్యాన్సర్‌ సోకడంతో ఆయన షెడ్యూల్‌పై సందిగ్ధం ఏర్పడింది. దత్‌ త్వరగా కోలుకొని కేజీఎఫ్‌లో పాల్గొనాలని ఆశిద్దాం.

అల్లు అర్జున్ 'పుష్ప'.. సుకుమార్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..!

రాజధాని విషయంలో జగన్ సర్కార్ చేసిన చట్టాలు చెల్లవు... రఘురామ సంచలన వ్యాఖ్యలు...?

మహేష్ ప్లాన్ మామూలుగా లేదుగా...ఏకంగా మూడా ?

ఘోరం: తల్లీ కొడుకుని కాటేసిన కరోనా వైరస్.. ఇంటి దరిదాపులకు వెళ్లని స్థానికులు...

యువతను కుంగదీస్తున్న కరోనా... ఐఎల్‌వో సర్వేలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు...?

ఆదేశాలు అమలు చేయడం లేదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు... వివరణ ఇచ్చిన సీఎస్...?

ఆ ముగ్గురిలో పవన్ ఓటు ఎవరికి..?

ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siraj
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top