Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేవీ శ్రీ ప్రసాద్ కి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ ..!

దేవీ శ్రీ ప్రసాద్ కి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ ..!

ఒకప్పుడు టాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవిశ్రీ ప్రసాద్ తప్ప మరో పేరు వినిపించేది కాదు. యంగ్ హీరోల సినిమాల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు దాదాపు అందరికి బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చాడు. అందుకే ఏ దర్శకుడు గాని ఏ హీరో గాని దేవీ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తమ సినిమాలకి తీసుకునేవారు. కాని వరసగా దేవీ మ్యూజిక్ ఇచ్చిన సినిమాలు ఆడియో పరంగా పెద్ద ఫ్లాప్స్ గా మిగిలాయి. దానికి తోడు ట్యూన్స్ మరీ రిపీటెడ్ గా ఇస్తున్నాడన్న బ్యాడ్ నేం కూడా పడింది.



సరిగ్గా అదే సమయంలో థమన్ దేవీ కి చెక్ పెట్టడం మొదలు పెట్టాడు. ఈ ఏడాది సంక్రాంతికి దేవిశ్రీ థమన్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు.

ఆ పోటీలో థమన్ నెగ్గాడు. అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలతో థమన్ దేవీ కి గట్టి ఇచ్చి సరిలేరు సినిమాకి చెక్ పెట్టాడు. సినిమా ఫలితం విషయంలో కూడా థమన్ కే కలిసి వచ్చింది. దాంతో దేవిశ్రీ ప్రసాద్ కి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అంతేకాదు ఇక ఇప్పుడప్పుడే దేవీ కోలుకోలేడని అనుకున్నారు. కాని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'రాధే' మూవీకి సాంగ్స్ ఇచ్చే ఛాన్స్ దక్కించుకున్నాడని తాజా సమాచారం.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రాధే సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ప్రభుదేవా తెలుగులో తెరకెక్కించిన సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఆ సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అందుకే సల్మాన్ ఖాన్ తన రాధే సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకున్నారట. రాధే సినిమా హిట్ అయితే దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ కం బ్యాక్ అయి ఫాం లోకి వచ్చేస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ మాత్రమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald